Abn logo
Sep 28 2020 @ 11:59AM

ట్రంప్ సర్కార్‌కు షాకిచ్చిన కోర్టు..!

Kaakateeya

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి.. కోర్టులో చుక్కెదురైంది. టిక్‌టాక్‌ విషయంలో ట్రంప్ సర్కార్.. తాజాగా జారీ చేసిన ఆదేశాలపై తాత్కాలిక నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.. దేశ భద్రతా కారణాలను చూపిస్తూ.. అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్‌పై బ్యాన్ విధిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను అమెరికా సంస్థకు నవంబర్ 12లోగా అమ్మేయాలని పేర్కొంది. అమెరికా సంస్థకు విక్రయించకపోతే.. నవంబర్ 12 తర్వాత అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలులేకుండా.. టిక్‌టాక్ యాప్  డౌన్‌లోడ్‌పై నిషేధాజ్జలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ కోర్టును ఆశ్రయించింది. టిక్‌టాక్ వినతిపై సానుకూలంగా స్పందించిన డిస్ట్రిక్ట్ జడ్జ్ కార్ల్ నికోల్స్.. ట్రంప్ సర్కార్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులపై తాత్కాలికంగా నిషేధం విధించారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement