నెల ఆలస్యంగా బైడెన్ లక్ష్యం చేరుకున్న అమెరికా

ABN , First Publish Date - 2021-08-04T10:22:37+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం ఎంతటిదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

నెల ఆలస్యంగా బైడెన్ లక్ష్యం చేరుకున్న అమెరికా

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం ఎంతటిదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది కరోనా వల్ల అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది వ్యాక్సినేషన్ వేగంగా జరగడంతో మెరుగైన స్థితిలో కనిపించింది. అప్పుడే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై 4 నాటికి దేశంలోని పెద్దవారిలో 70శాతం మందికి వ్యాక్సిన్ అందించడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా మందగించింది. 


ఈ క్రమంలో బైడెన్ పెట్టుకున్న లక్ష్యానికి నెలరోజుల ఆలస్యంగా అమెరికా టార్గెట్ రీచ్ అయింది. ఇప్పటికి అమెరికాలోని పెద్దవారిలో 70శాతం మంది కనీసం ఒక్క డోసు అయినా వ్యాక్సిన్ తీసుకున్నట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. మొత్తానికి అమెరికా జనాభాలో 50.24శాతం మందికి పూర్తిగా అంటే రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్లు సీడీసీ పేర్కొంది. కాగా, అమెరికాలో ఇప్పటి వరకూ ఏకంగా 3.5కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైంది ఇక్కడే. కరోనా మరణాలు కూడా అమెరికాలోనే అధికంగా నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటి వరకూ 6.29లక్షల కరోనా మరణాలు రికార్డయ్యాయి.

Updated Date - 2021-08-04T10:22:37+05:30 IST