అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నిరీక్షణకు తెర!

ABN , First Publish Date - 2022-04-19T16:21:49+05:30 IST

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్.

అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నిరీక్షణకు తెర!

హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్. స్టూడెంట్ వీసాల స్లాట్ల సంఖ్యను అగ్రరాజ్యం భారీగా పెంచింది. దీంతో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గిపోయింది. సోమవారం నుంచి భారీగా విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేయడంతో స్లాట్ల కోసం వేచి ఉండే సమయం 913 రోజుల నుంచి ఒక్కసారిగా 68 రోజులకు తగ్గింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వారికి హైదరాబాద్ కాన్సులేట్ సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్లాట్లు లభిస్తే ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడ ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు.


ఇలా ఇక్కడ రద్దీ పెరుగుతూ పోవడంతో విద్యార్థులు వీసా స్లాట్ల కోసం కొన్ని రోజుల క్రితం వరకు ఏకంగా మూడేళ్ల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పుడీ నిరీక్షణకు తెర పడింది. కాగా, హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో టూరిస్ట్ వీసా కోసం వేచి ఉండే సమయం సోమవారానికి కూడా 899 రోజులుగానే ఉంది. దీంతో పర్యాటక వీసాల దరఖాస్తుదారులు మాత్రం మునుపటిలానే ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.     

Updated Date - 2022-04-19T16:21:49+05:30 IST