గ్రీన్ కార్డులు వృథా చేస్తున్న అమెరికా..! భారతీయులకు భారీ నష్టం..!

ABN , First Publish Date - 2022-04-26T01:20:14+05:30 IST

గ్రీన్‌కార్డుల(శాశ్వత నివాసార్హత) కోసం అమెరికాలో అనేక మంది భారతీయులు దశాబ్దాల తరబడి కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తుంటే.. అమెరికా ప్రభుత్వం మాత్రం వేల సంఖ్యలో గ్రీన్ కార్డులను ఎవరికీ జారీ చేయకుండా వృథా చేస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

గ్రీన్ కార్డులు వృథా చేస్తున్న అమెరికా..! భారతీయులకు భారీ నష్టం..!

ఎన్నారై డెస్క్: గ్రీన్‌కార్డుల(శాశ్వత నివాసార్హత) కోసం అమెరికాలో అనేక మంది భారతీయులు దశాబ్దాల తరబడి కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తుంటే.. అమెరికా ప్రభుత్వం మాత్రం వేల సంఖ్యలో గ్రీన్ కార్డులను ఎవరికీ జారీ చేయకుండా వృథా చేస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికా వీసా కార్యాలయం తాజాగా లెక్కల ప్రకారం.. 2021లో మొత్తం 66,781 ఉద్యోగాధారిత గ్రీన్‌కార్డులు ఇలా వృథా అయిపోయాయి. కేటో ఇన్‌స్టిట్యూట్‌లోని రీసెర్చ్ ఫెలో అయిన  డేవిడ్ జే బియర్ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన సవివరమైన వ్యాసాన్ని ఆయన సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 


బియర్ అధ్యయనం ప్రకారం.. 2021 సంవత్సరానికి గాను మొత్తం 2,62,288 ఉద్యోగాధారిత గ్రీన్ కార్డులు అందుబాటులోకి రాగా.. ప్రభుత్వం కేవలం 1,95,507 మాత్రమే జారీ చేసింది. అంటే.. 66,781 వీసాలు వృథా అయిపోయాయన్నమాట. ఉద్యోగాధారిత గ్రీన్‌కార్డుల్లో వివిధ కేటగిరీలు ఉండగా.. ఇన్వెస్టర్లకు ఇచ్చే ఈబీ-5 కేటగిరీ గ్రీన్‌కార్డుల్లో ఏకంగా 84 శాతం వేస్ట్ అయిపోయాయి. ఇక సంఖ్యాపరంగా చూస్తే.. ఈబీ-3లో మొత్తం 75,014 గ్రీన్ కార్డులు అందుబాటులోకి రాగా.. 19,774 ఎవ్వరికీ జారీ కాలేదు. 


ఒక కేటగిరీలో మిగిలిపోయిన గ్రీన్ కార్డులను మరో కేటగిరీకి మారిస్తే ఉపయోగకరంగా ఉంటుందని బియర్ అభిప్రాయపడ్డారు. దేశాల వారిగా కేటియించిన గ్రీన్ కార్డుల్లో జారీ కాకుండా మిగిలిపోయిన వాటిని ఇండియాకు కేటాయిస్తే.. భారతీయులకు అదనంగా 7 శాతం కార్డులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం భారతీయుల్లో కొందరు అమెరికాలో శాశ్వత నివాసం కోసం 90 ఏళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-04-26T01:20:14+05:30 IST