Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌కు అమెరికా చేసిన సాయంపై రాజా కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా తన మిత్రదేశమైన భారత్‌కు ఇప్పటి వరకు 7.5మిలియన్ వ్యాక్సిన్ డోసులను మాత్రమే కేటాయించిందని కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్-అమెరికన్ రాజా కృష్ణమూర్తి అన్నారు. ఇది సరిపోదని, మరిన్ని వ్యాక్సిన్‌ డోసులను భారత్‌కు అందించాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్‌తో భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని.. టీకాలతో సహా ఇతర సహాయ సహకారాలు అందించనున్నట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ క్రమంలో రాజా కృష్ణమూర్తి స్పందించారు. ‘అధ్యక్షుడు బైడెన్, చట్టసభ మిత్రులను మరోసారి కోరుతున్నా.. నొవిడ్ యాక్ట్‌ను పాస్ చేసి మహమ్మారిని అంతం చేసేందుకు కృషి చేయాలి. చాలా దేశాలు వ్యాక్సిన్లు సరిపడా లేక, కొత్త కొవిడ్​ వేరియంట్​ వ్యాప్తితో బాధపడుతున్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరకొస్తోంది. ప్రపంచ భాగస్వామ్యం ద్వారా బిలియన్ల వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసి, పంపిణీ చేయడం ద్వారా మహమ్మారిని అంతం చేయాలి’ అని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement