అఫ్ఘానిస్థాన్‌కు 2 విమాన సర్వీసులు నడిపేందుకు భారత్‌కు అనుమతి!

ABN , First Publish Date - 2021-08-22T02:23:42+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ రాజధానిలోని కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఇకపై రోజుకు రెండు విమానసర్వీసులు నడిపేందుకు అమెరికా భారత్‌ను అనుమతించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అఫ్ఘానిస్థాన్‌కు 2 విమాన సర్వీసులు నడిపేందుకు భారత్‌కు అనుమతి!

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్‌ ఇకపై రోజుకు రెండు విమానసర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల పరమైన నాటి నుంచీ కాబూల్ ఎయిర్ పోర్టు అమెరికా భద్రతాదళాల ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. నాటో దళాలు.. తమ ఆయుధాలు, పౌరులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోజకు మొత్తం 25 విమాన సర్వీసులను నడుపుతున్నాయి. 


మరోవైపు.. అఫ్ఘానిస్థాన్‌లో ఇప్పటికీ 300 మంది భారతీయులు ఉన్నారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం భారతీయులను  దుషాంబె, తజికిస్థాన్, ఖతార్ రూట్ల ద్వారా స్వదేశానికి తరలిస్తోంది. ఇక.. 90 మంది భారతీయులతో కొద్ది సేపటి క్రితం కాబూల్‌లో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మరి కొద్ది గంటల్లో భారత్‌కు చేరనుంది. భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు వీలుగా విదేశాంగ శాఖ అధికారులు తాలిబన్లతో చర్చిస్తూ అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-08-22T02:23:42+05:30 IST