కరోనాపై అమెరికా సంస్థ తప్పుడు సమాచారం.. నమ్మేసిన ప్రపంచ దేశాలు?

ABN , First Publish Date - 2020-06-04T03:12:05+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిపై అమెరికాకు చెందిన ఓ కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

కరోనాపై అమెరికా సంస్థ తప్పుడు సమాచారం.. నమ్మేసిన ప్రపంచ దేశాలు?

వాషింగ్టన్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిపై అమెరికాకు చెందిన ఓ కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. దీని ప్రకారం, అమెరికాకు చెందిన సర్గిస్ఫేర్ అనే కంపెనీ కరోనాపై కొన్ని కథనాలు అందించింది. ఇవి కొన్ని ప్రముఖ మెడకల్ జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. వీటిపై నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. వీటిలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడితే కరోనా పేషెంట్లు మరణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నమ్మిన డబ్ల్యూహెచ్‌వో, కొన్ని దేశాలు కరోనా చికిత్స విధానాల్లో మార్పులు చేశాయని సదరు పత్రిక పేర్కొంది.

Updated Date - 2020-06-04T03:12:05+05:30 IST