భలే ఫ్యామిలీ.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! అందుకే గిన్నిస్ రికార్డ్ సాధించారు! వీళ్ల స్టోరీ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-19T22:53:06+05:30 IST

కొన్ని కుటుంబాల్లో ఒకరో ఇద్దరో పొడగరులు ఉండటం చూస్తూనే ఉంటాం! వాళ్లు ఆరడుగులు దాటితే.. అబ్బో ఎంత పొడుగ్గా ఉన్నారో అనుకుంటూ ఆశ్చర్యపోతాం. కానీ.. కుటుంబంలోని వారందరూ ఆజానుబాహులైతే..?

భలే ఫ్యామిలీ.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!  అందుకే గిన్నిస్ రికార్డ్ సాధించారు! వీళ్ల స్టోరీ ఏంటంటే..

ఎన్నారై డెస్క్:  కొన్ని కుటుంబాల్లో ఒకరో ఇద్దరో పొడగరులు ఉండటం చూస్తూనే ఉంటాం! వాళ్లు ఆరడుగులు దాటితే.. అబ్బో ఎంత పొడుగ్గా ఉన్నారో అనుకుంటూ ఆశ్చర్యపోతాం. కానీ.. కుటుంబంలోని వారందరూ ఆజానుబాహులైతే..? వాళ్లు నిలబడినప్పుడు టాపుకు తగులుతున్నట్టు కనబడితే.. మనం నోరెళ్లబెట్టడం ఖాయం.  అమెరికాకు చెందిన ఓ కుటుంబాన్ని చూస్తే అచ్చు ఇలాగే అనిపిస్తుంది. అందుకే...ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుటుంబంగా వీరికి గిన్నిస్ రికార్డుల్లో చోటు లభించింది. 


పూర్తి వివరాల్లోకి వెళితే..  మిన్నెసొటా రాష్ట్రం ఎస్కో ప్రాంతంలో ఉండే ఈ ఫ్యామిలీలో మొత్తం ఐదుగురు సభ్యులు. కుటుంబ పెద్ద పేరు  స్కాట్ ట్రాప్. ఆయన పొడవు ఆరడుగుల ఎనిమిది అంగుళాలు. ఇక ఆయన భార్య క్రిస్సీ పొడవు 6'3". ఆ దంపతులకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. స్కాట్ సంతానంలో అందరికంటే చిన్నవాడైన ఆడమ్(22)..  కుటుంబంలో అందరికంటే పొడగరి. అతడి హైట్ ఏకంగా ఏడు అడుగుల మూడు అంగుళాలు. ఇక ట్రాప్ దంపతుల పెద్ద కూతురు సవాన్నా(27) ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలు కాగా.. చిన్న కూతురు మాలీ(24) 6'6" పొడవుంటుంది.  దీంతో.. ఆ కుటుంబం సగటు పొడవు ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలకు చేరింది. అలా.. వీరిది అత్యంత పొడవైన ఫ్యామిలీగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. మొదటి నుంచి ఆ ఫ్యామిలీని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోయేవారట. ఇదేం హైటు అంటూ నోరెళ్లబెట్టేవారట. ఈ క్రమంలో వీళ్లే గిన్నిస్ రికార్డ్స్ వారిని సంప్రదించి తమ వివరాలను అందించారు. ఇటీవలే వారికి ఈ గుర్తింపు ఇస్తున్నట్టు గిన్నిస్ రికార్డ్స్ వారు తెలిపారు. ఇది తమకు ఎంతో గర్వకారణమంటూ ఆ కుటుంబం తెగ సంబరపడిపోతోంది.  




Updated Date - 2022-04-19T22:53:06+05:30 IST