US నుంచి భారత్ వచ్చే వారికి గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2021-07-21T19:18:45+05:30 IST

అమెరికా నుంచి భారత్‌కు వెళ్లే వారికి లైన్‌క్లియర్‌ అయింది. ఈ మేరకు ప్రయాణ ఆంక్షలను సడలిస్తూ బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ‘లెవల్‌-4’ నుంచి ‘లెవల్‌-3’కి తగ్గించింది. భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండటంతో సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) లెవల్‌-3 హెల్త్‌ నోటీసు జారీ చేసింది. అలాగే పాకిస్థాన్‌లో కరోనా రిస్క్‌ తక్కువగా ఉన్నందున సీడీసీ..

US నుంచి భారత్ వచ్చే వారికి గుడ్‌న్యూస్

ప్రయాణ ఆంక్షలను సడలించిన బైడెన్‌ సర్కార్ 

వాషింగ్టన్‌, జూలై 20 : అమెరికా నుంచి భారత్‌కు వెళ్లే వారికి లైన్‌క్లియర్‌ అయింది. ఈ మేరకు ప్రయాణ ఆంక్షలను సడలిస్తూ బైడెన్‌ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆంక్షలను ‘లెవల్‌-4’ నుంచి ‘లెవల్‌-3’కి తగ్గించింది. భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండటంతో సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) లెవల్‌-3 హెల్త్‌ నోటీసు జారీ చేసింది. అలాగే పాకిస్థాన్‌లో కరోనా రిస్క్‌ తక్కువగా ఉన్నందున సీడీసీ..  ఆ దేశానికి ‘లెవల్‌-2’ ట్రావెల్‌ అడ్వయిజరీ జారీ చేసింది. అయితే అక్కడ టెర్రరిజం, హింస ముప్పు ఎక్కువగా ఉన్నందున.. సీడీసీని పక్కన పెట్టి లెవల్‌-3 అడ్వయిజరీనే అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసింది. 


Updated Date - 2021-07-21T19:18:45+05:30 IST