9 మంది పేషెంట్లను లైంగికంగా వేధించిన డెంటిస్ట్

ABN , First Publish Date - 2021-06-16T05:42:21+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఒక డెంటిస్టు తన వద్దకు వచ్చే పేషెంట్లను లైంగికంగా వేధించాడు. ఎమాద్ మోవాద్ అనే అతను లాస్ ఏంజెలిస్‌లో డెంటల్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు.

9 మంది పేషెంట్లను లైంగికంగా వేధించిన డెంటిస్ట్

లాస్ ఏంజెలిస్: అగ్రరాజ్యం అమెరికాలో ఒక డెంటిస్టు తన వద్దకు వచ్చే పేషెంట్లను లైంగికంగా వేధించాడు. ఎమాద్ మోవాద్ అనే అతను లాస్ ఏంజెలిస్‌లో డెంటల్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. తన వద్దకు వచ్చిన కనీసం 9 మంది మహిళలతో అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో అతనిపై కేసు నమోదైంది. ఈ మహిళలను బలవంతంగా, బంధించి వేధించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ సందర్భంగా లాస్ ఏంజెలిస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జార్జ్ గాస్కాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ కేసు ఆందోళనకరం. ఎందుకంటే ఈ బాధితులందరూ వలసలు వచ్చిన వాళ్లు, తక్కువ సంపాదన ఉన్న మహిళలే. ఇలాంటి వాళ్లు సాధారణంగా పోలీసు కేసులు పెట్టడానికి జంకుతారు’’ అని జార్జ్ అన్నారు.

Updated Date - 2021-06-16T05:42:21+05:30 IST