బూస్టర్ డోసు తీసుకున్న అమెరికా మంత్రికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-04T05:42:16+05:30 IST

అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అక్కడ కొవిడ్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా అగ్రారాజ్యం రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కరోనా బారినపడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోవటంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది...

బూస్టర్ డోసు తీసుకున్న అమెరికా మంత్రికి కరోనా పాజిటివ్

అమెరికాలో కరోనా మహమ్మారి  మరోసారి విజృంభిస్తోంది. అక్కడ కొవిడ్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా అగ్రారాజ్యం రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కరోనా బారినపడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోవటంతో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.


తనకు కోవిడ్ సోకిందని.. డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్ లో ఉన్నానని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ స్వయంగా వెల్లడించారు. తాను వ్యాక్సిన్‌ తీసుకున్నాని.. గత అక్టోబర్‌లో బూస్టర్‌ డోస్‌ కూడా వేసుకున్నానని తెలిపారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ని కలిశానని కూడా ఆయన చెప్పారు. 


అమెరికాలో ఇప్పటివరకు 5,61,42,175 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,47,408 మంది మరణించగా, 4,15,43,060 మంది కోలుకున్నారు. మరో 1,37,51,707 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 

Updated Date - 2022-01-04T05:42:16+05:30 IST