భారత్‌లో అవస్థలు పడుతున్న అమెరికన్లు

ABN , First Publish Date - 2020-03-27T07:57:37+05:30 IST

పిల్లలను దత్తత తీసుకునేందుకు వచ్చి.. ఆరుగురు అమెరికన్లు భారత్‌లో చిక్కుకున్నారు. మార్చి మొదటి వారంలో అమెరికన్లు ఢిల్లీలోని హోటల్‌లో దిగారు. ఎం

భారత్‌లో అవస్థలు పడుతున్న అమెరికన్లు

న్యూఢిల్లీ: పిల్లలను దత్తత తీసుకునేందుకు వచ్చి.. ఆరుగురు అమెరికన్లు భారత్‌లో చిక్కుకున్నారు. మార్చి మొదటి వారంలో అమెరికన్లు ఢిల్లీలోని హోటల్‌లో దిగారు. ఎంతో కాలం నుంచి పెండింగ్‌లో ఉంటూ వస్తున్న తమ దత్తత అప్లికేషన్లు ఓకే అవడంతో మూడు జంటలు ఆనందపడ్డాయి. అయితే ఇదే సమయంలో ప్రధాని మోదీ 21 రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ప్రజలు ఇళ్లు కదిలి బయటకు రావద్దని మోదీ కోరారు. మరోపక్క భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన రాకపోకలను కూడా పూర్తిగా నిషేధించింది. దీంతో తాము హోటల్‌లోనే తిండికి కూడా కష్టాలు పడుతూ జీవిస్తున్నామని అమెరికన్ క్రిస్ శాంటా మేరియా(30) చెప్పుకొచ్చాడు. తాము భారత్‌కు వచ్చేటప్పటికి కరోనా అంశం నడుస్తోందని.. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించలేదని క్రిస్ తెలిపాడు. ప్రస్తుతం ఢిల్లీలోని యూ.ఎస్. ఎంబసీని అమెరికా తీసుకెళ్లవల్సిందిగా వేడుకుంటున్నామని పేర్కొన్నాడు. కాగా.. భారత్‌లో తాము అమ్మాయిని దత్తత తీసుకున్నట్టు క్రిస్ వెల్లడించాడు. తాము చికాగోలో ఉంటామని.. తమతో వచ్చిన మరో జంట అట్లాంటకు చెందిన వారిగా క్రిస్ వివరించాడు. మరోపక్క అమెరికన్లను తిరిగి అమెరికా తీసుకెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఢిల్లీలోని యూఎస్ ఎంబసి స్పందించింది. అతి త్వరలోనే మూడు జంటలు అమెరికా వెళ్లే ఏర్పాట్లు చేస్తామన్నారు.

Updated Date - 2020-03-27T07:57:37+05:30 IST