అమెరికాలో కరోనాతో 2లక్షల మంది మరణిస్తారు...

ABN , First Publish Date - 2020-06-11T14:45:56+05:30 IST

అమెరికాలో కరోనా మరణాల సంఖ్యపై హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ప్రముఖ వైద్యనిపుణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు....

అమెరికాలో కరోనాతో 2లక్షల మంది మరణిస్తారు...

హార్వార్డ్ వైద్యనిపుణుల అంచనా 

న్యూయార్క్ (అమెరికా): అమెరికాలో కరోనా మరణాల సంఖ్యపై హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ప్రముఖ వైద్యనిపుణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడం వల్ల అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ప్రముఖ వైద్యనిపుణుడు ఆశిష్ ఝా చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోకుంటే యూఎస్ లో కరోనా మరణాల సంఖ్య సెప్టెంబరులో 2 లక్షలకు దాటవచ్చని ఆశిష్ అంచనా వేశారు.


ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనాతో మరణించారు. పరీక్షలు చేసిన కరోనా రోగులను క్వారంటైన్ చేయడం, సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ లు ధరించడం ద్వారా కరోనా మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆశిష్ చెప్పారు. న్యూమెక్సికో, ఉటా, అరిజోనా, ఫ్లోరిడా, ఆర్కాన్సాస్ లలో కరోనా కేసుల సంఖ్య 40 శాతం పెరిగింది. లాక్‌డౌన్ అనంతరం అమెరికాలోని 50 రాష్ట్రాలు క్రమంగా తెరవడంతో వ్యాపార, సామాజిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మిన్నియాపాలిస్ పోలీసు కస్టడీలో మే 25న జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం జరిగిన నిరసనల్లో ప్రజలు సామాజిక దూరం పాటించక పోవడం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-11T14:45:56+05:30 IST