అమెరికాలోని ఈ రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోన్న కరోనా.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2020-08-31T08:34:13+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం

అమెరికాలోని ఈ రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోన్న కరోనా.. కారణమేంటంటే..

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికాలో నిత్యం దాదాపు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికా వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో స్కూళ్లు, యూనివర్శిటీలు తెరుచుకున్నాయి. ఈ కారణంగా కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా అయోవా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, మిన్నెసొటా, మోంటానా, ఇదాహో రాష్ట్రాల్లో నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్ రేటు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గుతున్నప్పటికి.. అనేక రాష్ట్రాల్లో కరోనా హాట్‌స్పాట్‌లు పెరుగుతున్నాయి. 


ఐయోవా రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో మెజారిటీ కేసులు యూనివర్శిటి ఆఫ్ అయోవా, అయోవా స్టేట్ యూనివర్శిటి నుంచే నమోదవుతున్నాయి. ఆయా యూనివర్శిటీలు తెరుచుకోవడంతో విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నారు. ఈ సమయంలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. మరోపక్క సౌత్ డకోటాలో ఇటీవల జరిగిన వార్షిక మోటర్ సైకిల్ ర్యాలీ వల్ల ఆ రాష్ట్రంలో భారీగా కేసులు బయటపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయొద్దంటూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసి మార్గదర్శకాలను 33 రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 61,69,205 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తం 1,87,194 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-08-31T08:34:13+05:30 IST