డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశాక.. ఆ ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి నెటిజన్ల హ్యాట్సఫ్!

ABN , First Publish Date - 2021-07-11T02:01:32+05:30 IST

ఓ పోలీసు అధికారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్‌ను

డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశాక.. ఆ ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి నెటిజన్ల హ్యాట్సఫ్!

వాషింగ్టన్: ఓ పోలీసు అధికారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్‌ను డెలివరీ చేయడానికి వెళ్తున్న ఓ డెలివరీ బాయ్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన నేరం కింద జోన్స్బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సదరు డెలివరీ బాయ్ వద్ద నుంచి ఆ ఫుడ్‌ను పోలీసులు తీసుకున్నారు. అనంతరం ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు  అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్ పోలీసే ఫుడ్‌ను డెలివరీ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను జోన్స్బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ పోలీసు అధికారులు #ProtectandServe‌ తో తమ ఫేస్‌బుక్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ పోలీసు అధికారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 


Updated Date - 2021-07-11T02:01:32+05:30 IST