భారత్ కంపెనీలకు అభినందనలు తెలిపిన అమెరికా..!

ABN , First Publish Date - 2020-06-04T06:31:47+05:30 IST

వెంటిలేటర్ల తయారీ కోసం నాసా (ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నుంచి లైసెన్స్ పొందిన మూడు భారతీయ కంపెనీలకు అమెరికా అభినందలు తెలిపింది. వివరాల్లోకి వె

భారత్ కంపెనీలకు అభినందనలు తెలిపిన అమెరికా..!

వాషింగ్టన్: వెంటిలేటర్ల తయారీ కోసం నాసా (ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నుంచి లైసెన్స్ పొందిన మూడు భారతీయ కంపెనీలకు అమెరికా అభినందలు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కొవిడ్-19 రోగుల చికిత్స కోసం నాసా.. వైటల్ పేరుతో వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. ఈ వెంటిలేటర్లను తయారు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే నాసా మాత్రం.. ప్రపంచ వ్యాప్తంగా 21 కంపేనీలకు మాత్రమే అనుమతిస్తూ.. లైసెన్స్‌లు ఇచ్చింది. ఈ 21లో.. మూడు భారత్‌కు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్.. భారత్‌కు చెందిన కంపెనీలను అభినందిస్తూ ట్వీట్ చేసింది.  




Updated Date - 2020-06-04T06:31:47+05:30 IST