అబార్షన్‌ల కోసం ప్రయాణఖర్చును చెల్లిస్తాం... అమెరికా ప్రధాన కంపెనీల వెల్లడి

ABN , First Publish Date - 2022-06-27T02:32:00+05:30 IST

డిస్నీ, JP మోర్గాన్, ఫేస్‌బుక్ యజమాని మెటాతో సహా ప్రధాన కంపెనీలు అబార్షన్‌ల కోసం ఉద్యోగుల ప్రయాణ ఖర్చులను భరిస్తామని సిబ్బందికి వెల్లడించాయి.

అబార్షన్‌ల కోసం ప్రయాణఖర్చును చెల్లిస్తాం...  అమెరికా ప్రధాన కంపెనీల వెల్లడి

* అబార్షన్ల నిషేధ చట్టం ఫ్లోరిడాలో జులై నుండి అమల్లోకి

న్యూయార్క్ : డిస్నీ, JP మోర్గాన్, ఫేస్‌బుక్ యజమాని మెటాతో సహా ప్రధాన కంపెనీలు అబార్షన్‌ల కోసం ఉద్యోగుల ప్రయాణ ఖర్చులను భరిస్తామని సిబ్బందికి వెల్లడించాయి. అబార్షన్‌కు రాజ్యాంగం కల్పించిన హక్కును రద్దు చేస్తూ యూఎస్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించనున్నట్లు  ఈ పరిణామం  చెబుతోంది. అమెజాన్ వంటి ఇతర సంస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి. కాగా... అధిక సంఖ్యలో కంపెనీలు తమ సొంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి అబార్షన్ చేయించుకునే ఉద్యోగులకు తమ ఆరోగ్య బీమా పథకాల ద్వారా ప్రయాణ ఖర్చులను భరిస్తాయని రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 


సుప్రీం కోర్ట్ తీర్పు ప్రభావాన్ని గుర్తించామని, కుటుంబనియంత్రణ, పునరుత్పత్తి సంరక్షణ సహా సరసమైన ఆరోగ్య సంరక్షణకు ‘యాక్సెస్’ను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్యోగులకు చెప్పినట్లు డిస్నీ తెలిపింది, డిస్నీ ఫ్లోరిడాలో రిసార్ట్‌లో దాదాపు 80 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫ్లోరిడా గవర్నర్ ఇప్పటికే 15 వారాల గర్భధారణ తర్వాత అబార్షన్‌లపై నిషేధం చట్టంపై సంతకం చేశారు, ఇది జూలై 1 నుండి అమల్లోకి రానుంది. 


ఇక బ్యాంకింగ్ దిగ్గజం JP మోర్గాన్ కూడా తన US ఉద్యోగులతో మాట్లాడుతూ... ‘జూన్ 1 నాటి స్టాఫ్ మెమో ప్రకారం ‘చట్టపరమైన గర్భస్రావాలు’ సహా వైద్య సేవల కోసం ప్రయాణ ఖర్చులను భరించనున్నట్లు వెల్లడించింది. మరో  ప్రముఖ పెట్టుబడి బ్యాంకు ‘గోల్డ్‌మన్ సాచ్స్’ కూడా జూలై 1 నుండి అబార్షన్ చేసుకోవడానికి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన ఉద్యోగులకు ప్రయాణ ఖర్చులను భరిస్తుందని తెలిపింది. సోషల్ మీడియా కంపెనీ మెటా... ‘రాష్ట్రం వెలుపల ఆరోగ్య సంరక్షణను యాక్సెస్ చేయడానికి అవసరమైన ఉద్యోగుల కోసం’ చట్టం ద్వారా అనుమతించబడిన ప్రయాణ ఖర్చులను రీయింబర్స్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.


అమెజాన్, రివ్యూ వెబ్‌సైట్ యెల్ప్, బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌ సహా పలు ఇతర కంపెనీలు స్థానిక అబార్షన్ పరిమితులను అధిగమించే క్రమంలో ప్రయాణించే ఉద్యోగులకు ఖర్చులను రీఇంబర్స్ చేస్తామని సుప్రీంకోర్టు తీర్పుకు గతంలోనే నివేదించాయి. కాగా... మొత్తం 13 రాష్ట్రాలు ఇప్పటికే ‘ట్రిగ్గర్’ చట్టాలను ఆమోదించాయి. కాగా... గుట్‌మాచర్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం... 20 కంటే ఎక్కువ రాష్ట్రాలు యాక్సెస్‌ను పరిమితం చేయడానికి యత్నిస్తున్నట్లు వినవస్తోంది. అబార్షన్ ప్రక్రియ కోసం మరో రాష్ట్రానికి ప్రయాణించే సందర్భాల్లో ఖర్చును కవర్ చేయడానికి ఆఫర్ చేసే కంపెనీలు అబార్షన్ వ్యతిరేక రిపబ్లికన్ల నుండి ఎదురుదెబ్బను ఎదుర్కొనే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-27T02:32:00+05:30 IST