పాక్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా బ్యాన్!

ABN , First Publish Date - 2020-07-12T00:57:43+05:30 IST

పాకిస్థాన్‌లో నకిలీ పైలట్ లైసెన్సుల కుంభకోణం బయటపడ్డ తరువాత పాక్ విమానాలంటేనే ప్రపంచం బెదిరిపోతోంది. మా దేశంలో రావద్దంటే మా దగ్గరకు రావద్దంటూ అనేక దేశాలు పోటాపోటిగా పాక్‌పై నిషేధాలు విధిస్తున్నాయి. ఇటీవల పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఆరు నెలల పాటు యూరప్‌లోకి ప్రవేశించొద్దంటూ ఐరోపా సమాఖ్య నిషేధం విధించింది. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోకముందే పాక్‌పై మరో పిడుగు పడింది.

పాక్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా బ్యాన్!

వాషింగ్టన్: పాకిస్థాన్‌లో నకిలీ పైలట్ లైసెన్సుల కుంభకోణం బయటపడ్డ తరువాత పాక్ విమానాలంటేనే ప్రపంచం బెదిరిపోతోంది. మా దేశంలోకి రావద్దంటే మా దగ్గరకు రావద్దంటూ అనేక దేశాలు పోటాపోటిగా పాక్‌పై నిషేధాలు విధిస్తున్నాయి. ఇటీవల పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఆరు నెలల పాటు యూరప్‌లోకి ప్రవేశించొద్దంటూ ఐరోపా సమాఖ్య నిషేధం విధించింది. ఈ  విషయాన్ని పూర్తిగా మర్చిపోకముందే పాక్‌పై మరో పిడుగు పడింది. తాజాగా అమెరికా కూడా దాయాదిదేశంపై ఇదే తరహా ఆంక్షలు విధించింది. పీఐఏ సంస్థ అమెరికాకు చార్టెడ్ విమాన సర్వీసులు నిర్వహించరాదంటూ ఆ దేశ పౌర విమానాయన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పాక్ నుంచి మాత్రం ఈ విషయమై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు. మరోవైపు..పాక్ స్వయంగా దేశంలో ఉన్న మొత్తం పైలట్లలో అనుమానితులుగా ఉన్న 33 శాతం మందిని విమానాలు నడపరాదంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-07-12T00:57:43+05:30 IST