అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. అంతరిక్షం నుంచి ఓటేసిన కేట్ రూబిన్స్!

ABN , First Publish Date - 2020-10-23T21:52:53+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భూమికి దాదాపు 408 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ అమెరికాకు చెందిన ఓ వ్యోమగామి ఎన్నికల్లో తన గళాన్ని వినిపించారు. ఇంటర్నెషనల్ స్పేస్ సెంటర్ నుంచి కేట్ రూబిన్స్ తన ఓటు హక్కును వి

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. అంతరిక్షం నుంచి ఓటేసిన కేట్ రూబిన్స్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భూమికి దాదాపు 408 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ అమెరికాకు చెందిన ఓ వ్యోమగామి ఎన్నికల్లో తన గళాన్ని వినిపించారు. ఇంటర్నెషనల్ స్పేస్ సెంటర్ నుంచి కేట్ రూబిన్స్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేట్ రూబిన్సే.. నాసాకు చెందిన యూఎస్ స్పేస్ ఏజెన్సీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ నుంచి నేను ఈ రోజు ఓటు వేశాను’ అని పేర్కొన్నారు. 2016 సందర్భంగా కూడా కేట్ రూబిన్స్ తన ఓటు హక్కును ఐఎస్‌ఎస్ నుంచే వినియోగించుకున్నారు. కాగా.. హ్యారిస్ కౌంటీ క్లర్క్ కార్యాలయం.. సురక్షితమైన ఎలక్ట్రానిక్ బ్యాలేట్‌ లింక్‌ను ఐఎస్‌ఎస్‌కు పంపుతుంది. సురక్షితమైన ఆ లింక్ ద్వారా వ్యోమగాములు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 

Updated Date - 2020-10-23T21:52:53+05:30 IST