31 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన అమెరికా

ABN , First Publish Date - 2021-06-16T00:24:57+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ కొంత నెమ్మదించినా.. ప్రస్తుతానికి ఇక్కడ 31 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించారట.

31 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన అమెరికా

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ కొంత నెమ్మదించినా.. ప్రస్తుతానికి ఇక్కడ 31 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందించారట. ఈ మేరకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపారు. జూన్ 14 నాటికి ఇక్కడ 31 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు సీడీసీ ప్రకటించింది. అమెరికాలోని మొత్తం 17 కోట్లమంది ప్రజలకు కనీసం ఒక వ్యాక్సిన్ డోసు ఇవ్వడం జరిగిందని, అలాగే 14 కోట్లమందికిపైగా ప్రజలకు పూర్తి వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపింది. ప్రపంచంలో కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న దేశం అమెరికానే. ఇక్కడ ఇప్పటికి 3.3కోట్లపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా ఇక్కడే అత్యధికంగా సంభవించాయి. కాగా, జూలై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశంలో పెద్దవారందరికీ వ్యాక్సిన్ అందాలని బైడెన్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2021-06-16T00:24:57+05:30 IST