Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 12 Aug 2022 16:02:25 IST

Urvashi Rautela Vs Rishabh Pant: మరోసారి యువ క్రికెటర్‌పై నటి విమర్శలు.. చోటూ భయ్యా అంటూ..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela), భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మధ్య కొంతకాలం రహస్యంగా ఎఫైర్ నడిచిందని వార్తలు వినిపించాయి. అయితే వారి మధ్య బంధం ఎంతోకాలం నిలవలేదు. అలాగని సామరస్యం వారిద్దరూ విడిపోలేదు. దీంతో పలుమార్లు వారిద్దరూ మధ్య సోషల్ మీడియా వేదికగా ఓ యుద్ధం నడిచింది. అందుకే అప్పుడప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.


ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. ‘వారణాసిలో ఓ షూటింగ్ ముగించుకుని మరో షూటింగ్ ఢిల్లి వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో నా ప్లైట్ 10 గంటలు డిలే అయ్యింది. దాంతో హోటల్ గదికి వెళ్లి నిద్రపోయాను. ఆ సమయం మొత్తం నాకోసం మిస్టర్.ఆర్‌పీ (రిషబ్ పంత్) హోటల్ లాబీలోనే ఎదురుచూశాడు. నేనే ఉదయం లేచి చూస్తే 16, 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అందుకే మర్యాద పూర్వకంగా అతన్ని కలిశాను’ అని చెప్పుకొచ్చింది.


దీనిపై రిషబ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘కొంత పాపులారిటీ కోసం, హెడ్‌లైన్స్‌లో ఉండటానికి ఇలాంటివి మాట్లాడతారు. ఇంటర్వ్యూలలో ఇలా అబద్ధాలు చెప్పడం చాలా తమషాగా అనిపిస్తుంది. కీర్తి, పేరు కోసం ఇలా చేయడం విచారకరం. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు’ అని పోస్టు చేశాడు. అనంతరం దాన్ని తొలగించాడు. అయినప్పటికి దాని స్ర్కీన్ షాట్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.


దానికి కౌంటర్‌గా తాజాగా ఊర్వశి ‘చోటు భయ్యా బ్యాట్ బాల్ ఆడాలి. చిన్న పిల్లోడి కోసం అపఖ్యాతి పాలు కావడానికి నేను మున్నిని కాదు. రక్షాబంధన్ శుభాకాంక్షలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వెటకారంగా పోస్టు పెట్టింది. దానికి.. ఆర్‌పీ చోటు భయ్యా, కౌగర్ హంటర్, సైలెంట్‌గా ఉన్న అమ్మాయి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోకు అని యాష్‌ట్యాగులు సైతం జత చేసింది. దీనికి రిషబ్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement