Apr 13 2021 @ 14:07PM

డైమండ్‌ మాస్క్‌తో మెస్మరైజ్‌ చేస్తున్న ఊర్వశి రౌతేలా

గ్లామర్‌తో అందాల విందు చేస్తూ కుర్రకారుని కట్టిపడేసే బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్‌లో ఊర్వశి రౌతేలా ముందు వరుసలో ఉంటుంది. సినిమాలతో బిజీగా ఉండే ఈ అమ్మడు ఏ మాత్రం ఖాళీ ఉన్నా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంటుంది. ఫొటో షూట్స్‌తో నెటిజన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తుంటుంది. ఏది చేసినా డిఫరెంట్‌గా ఉండాలనుకునే అలవాటున్న ఈ అమ్మడు మరోసారి తన స్పెషాలిటీని చూపించింది. ఈ కోవిడ్‌ సమయంలో అందరూ కచ్చితంగా వాడుతున్న మాస్కులను వాడుతున్నారు. అందరూ వాడుతున్నట్లు రెగ్యులర్‌ మాస్కులను కాకుండా ఊర్వశి రౌతేలా తనదైన ప్రత్యేకతను చూపించింది. ఏకంగా డైమండ్‌ మాస్క్‌ను పెట్టుకుని ఫోజులిచ్చి కెమెరా కళ్లకు జిగేల్‌మనిపించింది ఊర్వశి రౌతేలా. ఇంతకీ ఈ డైమండ్‌ మాస్క్‌ ఖరీదెంతో తెలుసా? అక్షరాలా... మూడు కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ డైమండ్‌ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.