ఉరుకుంద క్షేత్రం జనసంద్రం

ABN , First Publish Date - 2022-08-09T05:04:28+05:30 IST

ఉరుకుంద క్షేత్రం జన సంద్రంగా మారింది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది.

ఉరుకుంద క్షేత్రం జనసంద్రం
స్వామివారి దర్శనం వెళ్తున్న భక్తులు

  1. శ్రావణమాసం రెండో సోమవారం భక్తుల రద్దీ 
  2. వర్షంతో ఇబ్బందులు పడ్డ భక్తులు
  3. కోసిగి నుంచి ఉరుకుందకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ 

కోసిగి(కౌతాళం), ఆగస్టు 8: ఉరుకుంద క్షేత్రం జన సంద్రంగా మారింది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వాహనాల్లో తరలి వచ్చారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా భక్తులు లెక్క చయకుండా స్వామివారిని దర్శించుకున్నారు. పిండి వంటలు వండి నైవేద్యాలు సమర్పించారు. కోసిగి నుంచి జుమాలదిన్నె మీదుగా ఉరుకుంద వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామివారి దర్శనంలో కూడా ఇబ్బందులు పడ్డారు. ఈవో వాణి, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు భక్తులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించారు. సీఐ ఎరిషావలి, ఎస్‌ఐలు నరేంద్ర కుమార్‌రెడ్డి, రాజారెడ్డిలు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.


Updated Date - 2022-08-09T05:04:28+05:30 IST