ఉత్తుత్తి ఊరింపులు

ABN , First Publish Date - 2020-10-20T06:36:40+05:30 IST

గోదావరి జిల్లాల్లో వరదలు, భారీ వర్షాల తాకిడికి ఏటా వేల మంది రైతులు నష్టాల పాలవుతున్నారు. పెట్టుబడులు కోల్పోయి,

ఉత్తుత్తి ఊరింపులు

నష్టపరిహారం మాటలకే పరిమితం

విలవిల్లాడుతున్న గోదావరి రైతులు

వర్షాలు.. వరదలకు పంట నష్టాలపై అంచనాల హడావుడి

నేతల పలకరింపులు.. బ్యాంకుల్లో వేస్తామని ప్రకటనలు

ఏళ్లు గడుస్తున్నా ఇదే తంతు.. అందని పంట పరిహారం

ఆ ఊసే ఎత్తని సర్కార్‌.. మళ్లీ మొదలైన వానలు 

అన్నదాతల కన్నీరు మున్నీరు


(ఏలూరు-ఆంధ్రజ్యోతి):.

గోదావరి జిల్లాల్లో వరదలు, భారీ వర్షాల తాకిడికి ఏటా వేల మంది రైతులు నష్టాల పాలవుతున్నారు. పెట్టుబడులు కోల్పోయి, పంట చేతికి రాక, ఆర్థిక కష్టాలు భరించలేక నూతన ప్రభుత్వ హయాంలోనే దాదాపు 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గోదావరి వరదలు వచ్చిన ప్రతిసారీ నష్ట పరిహారం క్షణాల్లో చేతికందిస్తామంటూ ఊరి స్తూ చివరకు రిక్తహస్తాలు చూపుతున్నారు. గత ఏడాది జూలై-ఆగస్టు మాసాల్లో వరదలు వచ్చినప్పుడు 2,300 ఎకరాల పంట సర్వ నాశనమైంది. రెక్కాడితే గాని డొక్కాడని చిన్న చిన్న కమతాలపై ఆధారపడే గిరిజన, దళిత రైతులు తీవ్రస్థాయిలో నష్టాలను మూట కట్టు కున్నారు.

అప్పట్లో పంట నష్టం రూ.1.40 కోట్లని అంచనా బృందాలు లెక్కకట్టాయి. ఈ మొత్తాన్ని రైతులకు అందిస్తామని, దిగాలు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది పూర్తయిన ఏడాదిలోపే గడిచిన ఆగ స్టులో మరోసారి వరదలు, భారీవర్షాలు వచ్చి పడ్డాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో రైతులు కోలుకోలేని విధం గా దెబ్బతిన్నారు. 4,700 ఎకరాల్లో రూ.17 కోట్ల విలువైన పంట చేజా రింది. రైతు కంట కన్నీటిని మిగి ల్చింది. అప్పట్లో యధావిధిగా ఈ తరహా తంతే. అంచనా బృందాలు హడావుడి చేశాయి.


జిల్లా నుంచి మం డల స్థాయి వరకు అధికారుల సమీక్ష జరిగాయి. అన్నిచోట్ల అన్ని పార్టీల వారు రైతులను ఓదార్చారు. ఫొటోలకు పోజులు ఇచ్చారే తప్ప పరిహారం ఎప్పటిలోగా అందు తుందో రైతులకు స్పష్టం చేయలేదు. గోదావరి వరద మట్టం పెరిగిన ప్రతీసారి డ్రెయిన్‌లు ఎగదన్ని నష్టపోతు న్నారు. ప్రత్యక్షంగా భారీ వర్షాల తాకిడికి పంట పెట్టుబడిని కోట్లలోనే కోల్పోతున్నారు. ఇలా ఏటా రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. గతంలో పంట నష్టం జరిగినప్పుడు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ పేరిట, పంటల బీమా కింద పరిహారం చేతికందుతుం దంటూ, దిగాలు పడవద్దని పదే పదే బాకా ఊదేవారు. వీటిని నమ్మిన వందల మంది సన్న, చిన్నకారు రైతులు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. దీనికి సం బంధించి ప్రకటన ఎప్పుడు వెలువడుతుం దోనని వెయ్యి కళ్లతో వేచి చూసేవారు.


నెలల తరబడి ఎదురు చూసినా, పాలకుల కాళ్లా వేళ్లా పడినా అతీ, గతీ లేదు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా కోల్పోయింది వరి పంటనే. పెట్టు బడి ఎక్కువ, రాబడి తక్కువగా రైతులు విల విలలాడుతున్న తరుణంలోనూ ఇలాంటి కష్టా లు తప్పడం లేదు. పరిహారం ప్రకటించడంలో చూపించే శ్రద్ధ అందించడానికి వచ్చేసరికి మాత్రం నీరు గారిపోతోంది. ఇన్‌ పుట్‌ సబ్సిడీ పెద్ద మొత్తంలో లేకపో యినప్పటికీ అంతో ఇంతో చేతికందితే తిరిగి పంటలు వేసుకునేందుకు వీలు కలుగు తుందని రైతులు ఆశతో ఎదురుచూసేవారు.


2014లో రూ.2.17 కోట్లు, 2015లో రూ.100 కోట్లు, 2019లో రూ.2.30 కోట్లు, ఈ ఏడాది రూ.2.17 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. అప్పులు తెచ్చిన పెట్టుబడి కాస్తా చేయి జారడంతో వడ్డీ భారం మోపెడై రైతుల ఆత్మ హత్యలకు దారితీసింది. ఈ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత మొదటి ఏడాదిలోనే 13 మంది రైతులు వివిధ కారణాలతో ఆత్మ హత్యలకు పాల్పడినా పట్టించుకునేదెవరు?


Updated Date - 2020-10-20T06:36:40+05:30 IST