జిల్లాలో ఉర్సు వైభవం

ABN , First Publish Date - 2022-01-29T05:40:14+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లోని దర్గాల వద్ద ఉర్సు ఉత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

జిల్లాలో ఉర్సు వైభవం
దూపహాడ్‌లో గంధాన్ని మోసుకువస్తున్న భక్తులు

జిల్లాలోని పలు మండలాల్లోని దర్గాల వద్ద ఉర్సు ఉత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఉత్సవాలు నిలిచాయి. దర్గాలను అన్ని మతాల వారు దర్శించుకున్నారు. అర్వపల్లి, పెన్‌పహాడ్‌, సూర్యాపేట, హుజూర్‌నగర్‌ మండలాల్లో ఉర్సు ఉత్సవాలు జరిగాయి. 

అర్వపల్లిలో ఖాజా మొహినుద్దీన్‌ దర్గా..

అర్వపల్లి : అర్వపల్లి-జాజిరెడ్డిగూడెం గ్రామాల గుట్టల మధ్య వెలిసిన జాన్‌పాక్‌ షాహిద్‌ ఖాజా మొహినుద్దీన్‌ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, హబీబీలు గం ధాన్ని ఎత్తుకొని దర్గాకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. దర్గా వద్ద యాటపోతులను బలిచ్చి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సాయి నిఖిల్‌రెడ్డి, అమృతారెడ్డి, అక్బర్‌, బాబి, యాకుబ్‌ పాల్గొన్నారు. 

దూపహాడ్‌లో మహబూబా జాతర..

పెన్‌పహాడ్‌: మండలంలోని దూపహాడ్‌ గ్రామంలో మహాబుబా జాతరలో భక్తుల సందడి నెలకొంది. జాన్‌పహాడ్‌ నుంచి గంధాన్ని ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకువచ్చారు. గంధం కోసం భక్తులు పోటీపడ్డారు. జీవాలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మౌలిక వసుతులు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

కాసరబాదలో దంతాల దర్గా..

సూర్యాపేటరూరల్‌:  మండలంలోని కాసరబాద గ్రామశివారులోని దంతాల దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైంది. కాసరబాద నుంచి దంతాల కుటుంబం నుంచి గంధాన్ని సాంప్రదాయబద్దంగా డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా దర్గా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జడ్పీటీసీ జీడి బిక్షం, వైస్‌ఎంపీపీ రామసాని శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. సూర్యాపేట నుంచి ముజారులు దట్టీలు దర్గాపై కప్పి పూలతో అలంకరించారు. జీవా లను బలిఇచ్చి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్‌ రమణారెడ్డి, బంటు సైదులు, కిశోర్‌రెడ్డి, నాగరాజు, దంతాల వెంకన్న, రమేష్‌, ముజావరు సిద్దు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌లో సైదులుబాబా..

 హుజూర్‌నగర్‌ :  హుజూర్‌నగర్‌ పట్టణ పరిఽధిలోని గోపాలపురం రోడ్డులోని జాన్‌పహాడ్‌ సైదులుబాబా దర్గాలో ఉర్సు ఉత్సవాలు కొనసాగుతోంది. ఈ సందర్భంగా హైదరాబబాద్‌ నుంచి తీసుకొచ్చిన గంధాన్ని గుర్రంపై ఊరేగించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పూజారి అమీనాబీ, సర్పంచ్‌లు శాసనాల నాగసైదులు, షేక్‌ సలీమారంజాన్‌, ఆలీపాషా, ఖులుల్లారహిమాన్‌ తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-01-29T05:40:14+05:30 IST