Abn logo
Sep 27 2021 @ 11:05AM

13 ఏళ్ల కూతురితో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లి.. వాళ్లిద్దరూ చెప్పిన దారుణ నిజాలు విని విస్తుపోయిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

రాయ్‌పూర్(చత్తీస్‌గఢ్): కూతురికి జరిగిన అన్యాయం తెలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిందా ఆ తల్లి. పోలీసులకు వాళ్లిద్దరూ చెబుతున్న దారుణ నిజాలు విని పోలీసులు విస్తుపోయారు. ఆ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తికి తగిన బుద్ధి చెబుతామని పోలీసులు హామీ ఇచ్చారు.. వివరాల్లోకి వెళ్తే..


చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌ పట్టణంలోని ఉర్లా ప్రాంతానికి చెందిన దంపతులకు ఓ 13ఏళ్ల అమ్మాయి ఉంది. తండ్రి ఉర్లా ప్రాంతంలోనే ఉన్న ఫ్యాక్టరీలలో పని చేస్తూ ఉంటాడు. కన్నకూతురిపై ఎప్పటినుంచో కన్నేసిన ఆ నీచుడు.. ఓ రోజు తల్లిలేని సమయంలో అత్యాచారం చేశాడు. రెండేళ్లుగా ఆ యువతిని బెదిరించి లోబరుచుకుంటున్నాడు. అతడి ఆకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో.. జరిగిన అన్యాయం గురించి తల్లికి చెప్పింది. కన్నకూతురు అని చూడకుండా అఘాయిత్యానికి పాల్పడిన ఆ కామంధుడిపై ఫిర్యాదు చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఏం జరిగింది అని పోలీసులు అడగ్గా.. తన తండ్రి చేసిన ఆకృత్యాల గురించి ఆ అమ్మాయి చెప్పడం మొదలు పెట్టింది. జరిగిన అన్యాయం గురించి విని పోలీసులు విస్తుపోయారు. తన తండ్రికి ముందే పెళ్లి అయ్యిందని, అతడి వేధింపులు తాళలేక మొదటి భార్య ఢిల్లీలోని తన పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపింది. 


‘‘రెండేళ్ల క్రితం మా అమ్మ లేని సమయం చూసి నాపై అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నాకేదో అనుమానం వచ్చి దూరంగా వెళ్లిపోయాను. కానీ అతను బలవంతం చేసి నన్ను లొంగదీసుకున్నాడు. అమ్మకు విషయం చెబితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఇన్ని రోజులు చెప్పలేదు. ప్రతిరోజు నన్ను ఇబ్బంది పెట్టేవాడు’’అని తెలిపింది. కానీ అతడి ఆకృత్యాలు విపరీతమవుతుండడంతో తల్లికి అసలు విషయం చెప్పానని వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ కామాంధుడిని అరెస్టు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...