President Elections: కాంగ్రెస్ అత్యవసర సమావేశం

ABN , First Publish Date - 2022-06-20T19:01:54+05:30 IST

కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో 22 మంది ప్రతిపక్ష నేతలతో జరిగిన సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగినప్పటికీ.. అభ్యర్థి ఖరారు కాలేదు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరాద్ పవార్‌ను విపక్ష నేతలు ప్రతిపాదించినప్పటికీ, ఇందుకు ఆయన అంగీకరించలేదు. దీంతో అభ్యర్థిని ఖరారు చేయకుండానే సమావేశం ముగిసింది..

President Elections: కాంగ్రెస్ అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అత్యవసర సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పార్లమెంట్‌ భవనంలోని రూం నెం. 25లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోని ఎంపీలంతా సమావేశం కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. అధికార పార్టీకి పోటీగా ప్రతిపక్ష పార్టీల తరపున అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్ సహా దేశంలోని అనేక పక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ తమ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయలేదు.


కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో 22 మంది ప్రతిపక్ష నేతలతో జరిగిన సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగినప్పటికీ.. అభ్యర్థి ఖరారు కాలేదు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరాద్ పవార్‌ను విపక్ష నేతలు ప్రతిపాదించినప్పటికీ, ఇందుకు ఆయన అంగీకరించలేదు. దీంతో అభ్యర్థిని ఖరారు చేయకుండానే సమావేశం ముగిసింది. మరొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి సైతం విపక్షాల అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. దీనిపై కేసీఆర్ నుంచి కానీ, ఆ పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.


రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఉన్నప్పటికీ బీజేపీ ఇప్పటికీ తమ అభ్యర్థిని వెల్లడించలేదు. పైగా విపక్షాల మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. స్థానిక పార్టీల ప్రయత్నాలు ఎలా ఉన్నా బీజేపీ తర్వాత పెద్ద పార్టీగా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి సైతం రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇంకా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఎన్నికల గడువు మరో నాలుగు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో నేడు జరిగే సమావేశంలోనైనా దీనిపై ఓ క్లారిటీకి రావొచ్చని అంటున్నారు.


రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరగనుంది. జులై 21న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు జులై రెండు చివరి తేదీ. ఎలక్టోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి సహా... అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎలక్టరోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10,98,903 కాగా 5,34,680 ఓట్లు పొందిన అభ్యర్ధి రాష్ట్రపతిగా ఎన్నికౌతారు. ఎలక్టోరల్ కాలేజీలో 778 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలుంటారు. ఒక్కో ఎంపీ విలువ 700. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లు ఒక్కరికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది.

Updated Date - 2022-06-20T19:01:54+05:30 IST