Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 23 May 2022 13:31:13 IST

Viral Video: Urfi Javed వెరైటీ డ్రస్సు.. పగిలిపోయిన గాజు ముక్కలతో 20 కేజీల బరువుతో..

twitter-iconwatsapp-iconfb-icon

బిగ్‌బాస్ ఓటీటీ (Bigg Boss OTT)తో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. విచిత్ర వేషధారణతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ డ్రెస్సింగ్‌లో కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతుంటుంది. కొన్నిసార్లు వాటికి ప్రశంసలు రాగా.. మరికొన్నిసార్లు విమర్శల పాలవుతూ ఉంటుంది. తాజాగా సైతం మరోసారి డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


తాజాగా ఉర్పీ సోషల్ మీడియాలో ఓ వీడియోని అప్‌లోడ్ చేసింది. అందులో ఈ భామ పగిలిన గాజు పెంకులతో తయారు చేసిన డ్రెస్‌ని వేసుకుంది. ఆ డ్రెస్‌లో బరువు దాదాపు 20 కిలోలు ఉంటుందట. ఆ వీడియోకి.. ‘అవును.. నేను పగిలిన గాజు ముక్కలతో చేసిన దుస్తులను ధరించాను. ఇది అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇలాంటివి చూసి జనాలు నన్ను వెర్రి, పిచ్చి అని పిలుస్తుంటారు. కానీ మనందరం పిచ్చిగా, వెర్రిగా ఉన్నామని తెలుసుకోండి. నా గురించి చూసుకోవడానికి నాకు తగినంత శక్తి, తెలివి ఉన్నాయి’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వైరల్ వీడియోని చూసిన నటి రాఖీ సావంత్ (Rakhi Sawant) ఫిదా అయ్యి ఫైర్, హార్ట్ ఎమోజీలను కామెంట్స్‌లో పెట్టింది. అంతేకాకుండా పలువురు నెటిజన్లు సైతం ఉర్పీని ప్రశంసిస్తూ కామెంట్స్ చేయగా.. మరికొందరు ఎప్పటిలాగే విమర్శిస్తూ కామెంట్స్ చేశారు.


అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 3 మిలియన్లకి చేరడంతో ఉర్ఫీ చిన్న పార్టీ ఏర్పాటు చేసింది. దానికి నటి రాఖీ సావంత్ కూడా హాజరైంది. అనంతరం ఆ గ్లాస్ డ్రెస్ వల్ల గాయాలు అవుతుండడంతో ఉర్పీ దాన్ని తీసేసింది. అంతేకాకుండా ఆ డ్రెస్ బరువు 20 కిలోలకి పైగా ఉంటుందని మీడియాకి తెలిపింది. పార్టీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాఖీ ఉర్ఫీ స్టైల్ తనకి బాగా నచ్చినట్లు చెప్పింది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...