బ్రాలెస్ ఫోటోలు షేర్ చేసిన ఉర్ఫీ జావేద్.. ట్రోల్ చేసిన నెటిజన్లు

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది హిందీ బిగ్‌బాస్ ఫేమ్ ఉర్ఫీ జావేద్. సాధారణంగా ఈ బ్యూటీ తన ఫ్యాషన్ సెన్స్‌తో దాదాపు రెండు మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. అయితే గత కొద్దికాలంగా ఈ భామ షేర్ చేసిన పిక్స్‌తో ట్రోలింగ్‌కి గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఫోటోని పోస్ట్ చేయగా విపరీతంగా ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.


ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ పిక్‌లో ఆరెంజ్ కలర్ డ్రెస్‌తో బ్రా లేకుండా ఉంది. దానికి ‘మీకు ఇప్పటికే రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది కేవలం ఎగరడం మాత్రమే’ అంటూ క్యాప్షన్స్ ఇచ్చింది. అయితే బ్రా లేకపోవడంతో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు.


‘మీ రెక్కలు తెరుచుకోకూడద‌’ని కొందరు కామెంట్ పెట్టగా.. ‘ఆమె బ్రా వేసుకోలేద’ని మరి కొందరు వ్యాఖ్యానించారు. ‘అమ్మాయిలతో రణ్‌వీర్ సింగ్’ అని ఇంకొందరూ.. ‘ఈమెకి అమ్మాయిలతో పోలిక లేదం’టూ కొందరు ట్రోల్ చేశారు.


ఓ వైపు కొందరు నెగటివ్ అటుండగానే.. మరోవైపు ఆమె ఫ్యాషన్‌కి ఫిదా అయినవారు కూడా ఉన్నారు. ‘చాలా అందంగా, హాట్‌గా ఉంది. నైస్ డ్రెస్’ అంటూ కొందరూ.. ‘నీలోని తపనకి ఫిదా అవుతున్నామం’టూ మరికొందరు.. ‘చాలా అందంగా, ఫర్ఫెక్ట్‌గా ఉన్నావ’ని ఇంకొందరూ కామెంట్స్ చేశారు.


Advertisement