Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 30 Jun 2022 11:07:10 IST

Tailor Murder: ‘అల్లా’ క్షమించడన్న Bigg Boss బ్యూటీ.. నటి Urfi Javedని చంపేస్తామంటూ బెదిరింపులు

twitter-iconwatsapp-iconfb-icon

హిందీ బిగ్‌బాస్ ఓటీటీ (Bigg Boss OTT)తో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి ఉర్ఫీ జావేద్‌ (Urfi Javed). ఈ బ్యూటీ ఫ్రీడంని, వ్యక్తిగత స్వేచ్ఛను ఎక్కువగా నమ్ముతుంది. దీంతో బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌తో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ప్రత్యేక వేషధారణలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాకుండా.. ఈ భామ దేశంలో జరిగే పలు విషయాలపై నిర్భయంగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఇటీవలే జరిగిన ఉదయ్‌పూర్ టైలర్ (Udaipur Tailor) కన్హయ్య లాల్‌ హత్యపై ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు పోస్ట్‌‌లను షేర్ చేసింది.


ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌ షేర్ చేసిన స్టోరీలో.. ‘మనం ఎటు వెళుతున్నాం. ఆయన పేరు వాడుకొని ఇతరులని అసహ్యించుకోవాలని, చంపాలని అల్లా చెప్పలేదు. వీళ్లని అల్లా క్షమించడు’ అంటూ రాసుకొచ్చింది. అలాగే మరో స్టోరీలో.. ‘తమ మతాలు, దేవుళ్ల పేరు చెప్పి జనాలు ఇతరులని అసహ్యించుకుంటున్నారు. చంపుతున్నారు. కానీ ఒకటి ఆలోచించండి. మనం చదువు, మహిళ సాధికారత, వేగంగా అత్యాచార కేసులను విచారించడం, జీడీపీ గురించి ఎందుకు మాట్లాడం. ప్రజల్లో నైతికతని, విలువలను నేర్పెందుకు మతాలు ఏర్పడ్డాయి. కానీ.. ప్రస్తుత కాలంలో.. మీ మతం మిమ్మల్ని వాటికి దూరం చేయడం దురదృష్టకరం. తీవ్రవాదంతో మనుషులు వినాశనం సృష్టిస్తున్నారు. ఇంకా ఆలస్యం కాలేదు. కళ్లు తెరవండి. ఈ పోస్ట్ తర్వాత చాలామంది నన్ను అసహ్యించుకుంటారని నాకు తెలుసు. కానీ.. మీలాగ నాలో తీవ్రవాదం లేకపోవడం సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చింది.

Tailor Murder: అల్లా క్షమించడన్న Bigg Boss బ్యూటీ.. నటి Urfi Javedని చంపేస్తామంటూ బెదిరింపులు


Tailor Murder: అల్లా క్షమించడన్న Bigg Boss బ్యూటీ.. నటి Urfi Javedని చంపేస్తామంటూ బెదిరింపులు


ఉర్ఫీ స్టోరీస్ చూసిన సాజిద్ చిప్ప అనే వ్యక్తి ఆమెని బెదిరిస్తూ మెస్సేజ్ చేశాడు. అందులో.. నటిని బూతులు తిడుతూ, తనని సైతం చంపేస్తారని బెదిరింపులకి దిగాడు. ఈ మెస్సేజ్‌లని సైతం ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దానికి.. ‘మతం పేరుతో నన్ను చంపేస్తానని బెదిరించిన ఇతనిపై పోలీసు కేసు ఫైల్ చేస్తాను. ఇది తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులకి గుణపాఠంగా నిలుస్తుంది. జైలుని ఎంజాయ్ చేయి సాజిద్’ అంటూ రాసుకొచ్చింది. అలాగే ముంబై పోలీసులని సైతం ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేసింది.

Tailor Murder: అల్లా క్షమించడన్న Bigg Boss బ్యూటీ.. నటి Urfi Javedని చంపేస్తామంటూ బెదిరింపులు


ఉదయ్‌పుర్ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. గౌహర్ ఖాన్, రణవీర్ షోరే, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు ఈ సంఘటనను తప్పుపట్టిన వారిలో ఉన్నారు. అయితే.. ఆ హత్యకు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా లేదా అనే విషయాన్ని విచారిస్తున్నారు. కాగా.. ఇటీవలే ఓ సంస్థ ఆసియాలో నెటిజన్లు అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో జాన్వీ కపూర్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ వంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్లను వెనక్కినెట్టి ఉర్ఫీ 57వ స్థానంలో నిలవడం విశేషం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...