ఆ పాత్ర చేయకపోతే జైల్లో పెడతానన్నారు.. నా శరీరంపై దుస్తులన్నీ తొలగించారంటూ షాకింగ్ నిజాలు చెప్పిన Urfi Javed

ఒక బాలీవుడ్ నటి తనకు ఎదురైన ఇబ్బంది గురించి తెలిపింది. ఆ పాత్ర చేయకపోతే నన్ను జైల్లో పెడతానని నిర్మాత బెదిరించిందని ఆరోపించింది. బిగ్‌బాస్ ఓటీటీ షోలో పాల్గొనడం ద్వారా ఫేమ్‌ను సంపాదించుకున్న నటి ఉర్ఫీ జావేద్. అనంతరం సోషల్ మీడియాలో ఆమె సంచలనంగా మారింది. అభిమానులు విపరీతంగా పెరిగారు. బాలీవుడ్‌లోను 2016 నుంచి తన నటన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. 


ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జీవితంలో ఎదురైన ఆటు, పోట్లా గురించి ఆమె ప్రస్తావించింది. షాకింగ్ కలిగించే ఘటనలు తనకు ఎదురయ్యాయని వెల్లడించింది. ‘‘  ఒక మహిళ నిర్మాత నన్ను పూర్తి స్థాయి లెస్బియన్ పాత్రను పోషించమంది. ఆమెను ఎంతగా ప్రాధేయపడినప్పటికీ  నా మాట వినలేదు. నేను ఈ పాత్రను పోషించలేనని సారీ అని కూడా చెప్పాను. నువ్వు కాంట్రాక్ట్ మీద సంతకం చేశావు. ఆ పాత్రను చేయకపోతే కటకటాల లోపలికి పంపిస్తానని ఆమె బెదిరించింది. నా శరీరం మీద నుంచి దుస్తులన్నింటిని తొలగించింది. లో దుస్తుల మీదే ఉండవలసి వచ్చింది. ఆ విధంగా చేయకండని నేను చెప్పాను. అయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు.  స్ర్కిప్ట్‌లో లేకపోయినప్పటికీ  లైంగికంగా వేధించే సీన్లను ఆమె షోలో పెట్టింది. దీంతో బెడ్ మీదే వెక్కి, వెక్కి ఏడ్చాల్సి వచ్చింది. అటువంటి ఘటనలు నాకు ఎన్నోసార్లు ఎదురయ్యాయి ’’ అని ఉర్ఫీ జావేద్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 


నేను ఒక మాములు కుటుంబం నుంచి వచ్చానని ఆమె పేర్కొంది. తన తండ్రి ఎటువంటి స్వాతంత్ర్యం కూడా ఇవ్వలేదని వెల్లడించింది.  బడే బయ్యా కీ దుల్హనియా, మేరీ దుర్గ, అయే మేరీ హమ్ సఫార్ వంటి తదితర షోలల్లో నటించింది.

Advertisement