యూరియా..వ్యాపారుల దయ!

ABN , First Publish Date - 2020-09-24T06:39:31+05:30 IST

భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులను, పె ట్టుబడి మాటున దళారీ వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు

యూరియా..వ్యాపారుల దయ!

అదనంగా రూ. వంద ఇస్తేనే ఎరువు

మన్యంలో వ్యాపారుల మాయాజాలం

పెట్టుబడుల పేరుతోనూ వంచన

నిలువునా మోసపోతున్న అన్నదాతలు

పట్టించుకోని వ్యవసాయశాఖాధికారులు

నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నా దాడులు శూన్యం


గుండాల, సెప్టెంబరు 23: భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులను, పె ట్టుబడి మాటున దళారీ వ్యాపారులు నిలువునా ముంచుతున్నారు. పల్లెల్లో దళారీ వ్యా పారులను ప్రశ్నించేవారు లేక పోవడంతో తమ ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. పోడు భూములకు బ్యాంకుల్లో అప్పులు పుట్టక, ప్రైవేట్‌ వడ్డి వ్యాపారుల చేతుల్లో బందీలుగా మారుతున్న రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతం. ప్రభుత్వం యూరియా బస్తాకు రూ.280కు విక్రయిస్తుండగా, వ్యాపారులు రూ.380కి అమ్ముతున్నారు. వ్యవసాయ శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో రైతులు ఒక్కో యూరియా బ స్తాకు రూ.100 అదనంగా చెల్లించక తప్పని దుస్థితి నెలకొంది.


ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల్లోని దళారీ వ్యాపారులు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టకుని నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మన్యంలోని అనేక మంది వ్యాపారులకు ఏలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారాలు జోరుగా సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో, వర్షాకాలంలో మొక్క జొన్నపై నిషేధం విధించింది. మన్యంలోని పోడు సాగుదారులు మొక్కజొన్న సాగు చేస్తా రనే భావనతో వ్యాపారులు నాసిరకమైన విత్తనాలను తీసుకొచ్చి రైతులకు అంటకట్టారు. దీంతో రెండు, మూడు అడుగులు ఎదిగిన మొక్కజొన్న తర్వాత ఎండిపోయింది. దీంతో రైతులు మరలా మొక్కజొన్న వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మొక్కజొన్న చేలు అడుగు ఎ త్తులో ఉన్నాయి. వాటిలోనూ ఎదుగుదల అంతంతమాత్రంగా ఉండటంతో ఇటీవల కు రిసిన వర్షాలకు యూరియా వేసేందుకు సిద్ధమయ్యారు. కాన్నీ అన్నదాతల అవసరాన్ని ‘క్యాష్‌’ చేసుకునేందుకు వ్యాపారులు కొత్త ఎత్తుగడ వేశారు. ఏకంగా ఒక్కో బస్తాపై రూ. వంద దండుకుంటున్నారు.


రూ. కోట్లల్లో పెట్టుబడులు పెట్టారు

గుండాల మండలంలోని కాచనపల్లికి చెందిన ఓ వ్యాపారికి, ఇల్లెందు మండలంలోని ఇద్దరు వ్యాపారులు రూ.కోట్లలో రైతులకు పెట్టుబడులు పెట్టడం గమనార్హం. యూరియా బస్తాకు రూ:100 అదనంగా రైతులనుంచి గుంజుతున్న వడ్డి వ్యాపారులు వారి ఇచ్చిన పె ట్టుబడికి నూటికి రూ. మూడు చొప్పున వసూలు చేస్తున్నారు. గతంలో మన్యంలో యి స్టులు ప్రభావం ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం వారి అలజడి లేక పోవడంతో, అధికారులు వ్యాపారులకు వత్తాసు పలుతున్నారు. గుండాల మండలానికి సరిహద్దులోని ఓ గ్రామం లోని ఓ వ్యక్తి రైతులకు పెట్టుబడుల పెరుతో అధిక వడ్డీలు వసూలు చేశాడు.


ఇలా వసూలు చేసిన నగదుతో అతడు రూ.కోట్లకు పడగలెత్తినా అధికారులు చర్యలు తీసుకోలే దు. మన్యంలో ఇంతవరకూ వ్యవసాయశాఖాధికారులు విత్తన వ్యాపారులు, ఎరువులు, పురుగుమందుల షాపులపై దాడులు చేసిన దాఖలాలు కనిపించడంలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ సహకార సంఘం ద్వారా వచ్చిన ఎరువులను, విత్తనాలను దళారీ వ్యాపారులకు ప్రభుత్వ ధర ప్రకారం ఇస్తుండటం గమనార్హం. వాటిని దళారీ వ్యాపా రులు అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారు.

Updated Date - 2020-09-24T06:39:31+05:30 IST