నేరాల నియంత్రణకు చర్యలు

ABN , First Publish Date - 2020-11-29T05:48:31+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ షెముషి బాజ్‌పాయ్‌ ఆదేశించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో పెండింగ్‌ కేసులు, చోరీ కేసులు, అట్రాసిటీ కేసులు, బాలికలపై అత్యాచారాలు, చెయిన్‌ స్నాచింగ్‌లు తదితర నేరాలపై సమీక్షించారు.

నేరాల నియంత్రణకు చర్యలు

  • పోలీసు అధికారుల సమీక్షలో అర్బన్‌ జిల్లా ఎస్పీ షెముషి బాజ్‌పాయ్‌

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 28: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ షెముషి బాజ్‌పాయ్‌ ఆదేశించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో పెండింగ్‌ కేసులు, చోరీ కేసులు, అట్రాసిటీ కేసులు, బాలికలపై అత్యాచారాలు, చెయిన్‌ స్నాచింగ్‌లు తదితర నేరాలపై సమీక్షించారు. స్టేషన్ల వారీగా నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌ కేసులు, నిందితుల అరెస్టులపై ఆరా తీశారు. అదనపు ఎస్పీ కె.లతామాధురి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. అర్బన్‌ జిల్లా పరిధిలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. టూటౌన్‌ సీఐ బి.వెంకటేశ్వరరావు, వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఎస్‌.వెంకయ్య, ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎ.సత్యనారాయణ, టూటౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.ప్రసాద్‌, త్రీటౌన్‌ కానిస్టేబుల్‌ జి.సూర్యనారాయణ, ప్రకాష్‌నగర్‌ స్టేషన్‌ కానిస్టేబుళ్లు కె.సురేష్‌బాబు, కె.బాలగంగాధర్‌లకు నగదు రివార్డులు అందజేశారు. 


Updated Date - 2020-11-29T05:48:31+05:30 IST