పోలీస్‌స్టేషన్‌లో ఆధునిక రిసెప్షన్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2020-11-30T05:17:59+05:30 IST

వివిధ వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి ఆహ్లాదకర వాతావరణం కోసం ఆధునిక రిసెప్షన్‌ సెంటర్‌లు ఎంతగానో దోహదపడతాయని అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి అన్నారు.

పోలీస్‌స్టేషన్‌లో ఆధునిక రిసెప్షన్‌ సెంటర్‌
బాధితురాలితో మాట్లాడుతున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

ప్రారంభించిన అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

 గుంటూరు, నవంబరు 29: వివిధ  వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి ఆహ్లాదకర వాతావరణం కోసం ఆధునిక రిసెప్షన్‌ సెంటర్‌లు ఎంతగానో దోహదపడతాయని అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి అన్నారు.  పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన ఆధునికీకరించిన అరండల్‌పేట స్టేషన్‌ రిసెప్షన్‌ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం తొలి ఫిర్యాదును స్వీకరించారు. అన్ని స్టేషన్లలోనూ ఇదేవిధంగా రిసెప్షన్‌ సెంటర్‌లు తీర్చిదిద్దుతామన్నారు. ఇక్కడ బాధితుడి సమస్య అడిగి వివరాలు నమోదు చేసుకొని వెంటనే సంబంధిత ఎస్‌హెచ్‌ఓకు తెలియజేస్తారన్నారు. ఈ సెంటర్‌లో ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌, రెగ్యులర్‌ హెల్ప్‌ డెస్క్‌ ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ గంగాధరం, డీఎస్పీలు వీవీ రమణకుమార్‌, శీతారామయ్య, ప్రకాష్‌బాబు, బాల సుందరరావు, సీఐలు బత్తుల శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, మల్లిఖార్జునరావు, రాజశేఖర్‌రెడ్డి, ఫిరోజ్‌, సురేష్‌బాబు, మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-30T05:17:59+05:30 IST