కరోనా కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు

ABN , First Publish Date - 2021-05-12T06:22:51+05:30 IST

కర్ఫ్యూ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి తిరిగే వారిపై చట్టప్రకారం చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

కరోనా కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
వాహన డ్రైవర్లను ప్రశ్నిస్తున్న అర్బన్‌ ఎస్పీ

గుంటూరు మే 11: కర్ఫ్యూ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి తిరిగే వారిపై చట్టప్రకారం చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వాహన చోదకుల ను రికార్డులను పరిశీలించారు. ఎందుకు రోడ్లపైకి రావల్సి వచ్చిం దో వారి వివరాలు అడిగి తెలుకున్నారు. ఆసుపత్రి పనిమీద వస్తున్నట్లు చెప్పిన వారి నుంచి వివరాలు తీసుకొని సంబంధిత ఆసుపత్రులకు ఫోన్‌ చేసి విచారించారు. నిబంధనలు అతిక్రమిం చిన వాహనాలను ప్రతిరోజు 100 నుంచి 120 సీజ్‌ చేస్తున్నామన్నారు. అలాగే 20 నుంచి 25 దుకాణాలపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కాలక్షేపం, వాకింగ్‌ కోసం రోడ్డుపైకి వచ్చే వారిని ఉపేక్షించేది లేదని వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. మొదటిసారి కరోనా వచ్చినప్పటి కంటే ప్రస్తుతం ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలు సహకరిస్తున్నారన్నారు.

Updated Date - 2021-05-12T06:22:51+05:30 IST