సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి

ABN , First Publish Date - 2022-05-24T04:45:37+05:30 IST

సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు.

సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి
27వ వార్డులో డ్రైనేజీ పనులకు భూమి పూజ చేస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌

 వనపర్తి టౌన్‌, మే 23: సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు  మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని 27వ వార్డులో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం సూచించిన విధంగా జూనియర్‌ కళాశాల మైదా నంలో కొకొ, కబడ్డీ, వాలీబాల్‌ మైదానాల ఏర్పాట్ల ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతిలో క్రీడల అభివృద్ధ్దికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారని తెలిపారు. అందులో భాగంగానే కళాశాల మైదానంలో కబ డ్డీ, వాలీబాల్‌, కొకొ క్రీడల కోసం మైదానాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 2వ తేదీ నాటికి పనులు పూర్తి చేసి అధికారికంగా ప్రారంభిస్తా మని అన్నారు. విద్యార్ధులకు నాణ్యవంతమైన విద్యతో పాటు క్రీడలపై మక్కువ పెంచేందుకే పట్టణంలోని కేడీఆర్‌ నగర్‌, ఆర్‌డీవో కార్యాల యం దగ్గర, జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రత్యేక క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంతకు ముందు పట్టణంలో జరు గుతున్న రోడ్ల విస్తరణ పనులను ఆయన పరిశీ లించారు.   కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారు కృష్ణ, నాగన్న యాదవ్‌, నక్క రాములు, లక్ష్మిదేవమ్మ, నాయకులు పరశురాం, గులాం ఖాధర్‌, శేఖర్‌, డీఈ వెంకన్న, ఏఈ భాస్కర్‌, నక్క మహేష్‌, శివ, నందిమల్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-24T04:45:37+05:30 IST