యాదాద్రిలో యాత్రీకులను ఆకట్టుకునే అరణ్యం అర్బన్‌ఫారెస్ట్‌పార్క్‌

ABN , First Publish Date - 2020-07-04T00:18:43+05:30 IST

పర్యాటకులను ఆకట్టుకునే విధంగా యాదాద్రిలో ఆంజనేయ అరణ్యం అర్బన్‌ఫారెస్ట్‌ రూపు దిద్దుకుంది.

యాదాద్రిలో యాత్రీకులను ఆకట్టుకునే అరణ్యం అర్బన్‌ఫారెస్ట్‌పార్క్‌

యాదాద్రి: పర్యాటకులను ఆకట్టుకునే విధంగా యాదాద్రిలో ఆంజనేయ అరణ్యం అర్బన్‌ఫారెస్ట్‌ రూపు దిద్దుకుంది. రాయిగిరి రిజ ర్వుఫారెస్ట్‌ బ్లాక్‌లో 4కి.మీ. విస్తీర్ణంలో 97.12 హెక్టార్లలో 3.61 కోట్ల వ్యయంతో నర్సింహా రాయిగిరి, రిజర్వ్‌ఫారెస్ట్‌బ్లాక్‌లో 3.6 కి.మీ. విస్తీర్ణంలో 56.65 హెక్టార్లలో రూ. 2.83 కోట్ల వ్యయంతో ఆంజనేయ అరణ్యం అర్బన్‌ఫారెస్ట్‌ పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. యాదాదీశ్వరుడి క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక ,పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడికి వచ్చే యాత్రీకులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో రాయగిరి రిజర్వు ఫారెస్ట్‌ ఏరియాలో నర్సింహా అరణ్యం, అంజనేయ అరణ్యం అర్బన్‌పార్క్‌లను అభివృద్ధిచేసినట్టుఅధికారులు వెల్లడించారు. 


అంతరించిపోతున్నఅడవులను పరిరక్షించడం, క్షీణించిన అడవుల పునరుజ్జీవ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ర్ట్రపభుత్వం నర్సింహా అరణ్యం, ఆంజనేయ అరణ్యం ఎకోటూరిజం పార్కును ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. వినూత్న పద్దతిలో అటవీ భూముల పరిరక్షణ, పర్యావరణాన్ని పరిక్షించడంతో పాటు యాత్రీకులను ఆకట్టుకునేలా ఆహ్లాదకరంగా, అందంగా ఆర్బన్‌ఫార్కులను తీర్చిదిద్దారు. నేచర్‌ థీమ్‌తో నర్సింహా, ఆంజనేయ అరణ్యాల ఎంట్రీ ప్లాజాను ఏర్పాటుచేవారు. ప్రకృతి జీవావరణ వ్యవస్ధ గురించి ఆసక్తిని కలిగించేలా ఈ పార్కులను రూపుదిద్దారు. 


ఎకోటూరిజం ప్రమోషన్‌లో భాగంగా ప్రకృతి, పర్యావరణ, జీవావరణ వ్యవస్దల ప్రాధాన్యత, వీటిపట్ల అవగాహన కల్పించేందుకు ఎకోటూరిజం ప్రమోషన్‌లో భాగంగా విజిటర్‌జోన్‌ను తీర్చిదిద్దారు. నర్సింహా అరణ్య పార్కులో అవెన్యూ ప్లాంటేషన్‌తో కూడిన వాకింగ్‌ ట్రాక్స్‌, యానిమల్‌డెన్స్‌, సాక్రేడ్‌యానిమల్‌వ్యూ పాయింట్స్‌, గజీబో హంపిథియటేటర్‌, డీర్‌, రెస్క్యూ ఎంట్రీ ప్లాజా, నేచర్‌ ట్రయల్స్‌ టు ది టెంపుల్‌ ఆన్‌ టాప్‌ ఆఫ్‌ దిహిల్‌, పార్కింగ్‌ ఏరియా, రాక్‌ గార్డెన్‌, సీటింగ్‌లోకేషన్స్‌, ఫెన్సింగ్‌, వాష్‌ రూంలను ఏర్పాటు చేశారు. 


అలాగే ఆంజనేయ అరణ్యంలో గజిబో, వాకింగ్‌ ట్రాక్‌, ధీమ్‌పార్కులు, సెల్ఫీపాయింట్స్‌, వాటర్‌ఫాల్‌, రాక్‌గార్డెన్స్‌, బాహుబలి వాచ్‌ టవర్‌, వాక్‌ ఓవ ర్‌ బ్రిడ్జిలు, నేచర్‌ ట్రయల్స్‌, సీటింగ్‌ టెంచెస్‌ను ఏర్పాటుచేశారు. ఇక అరువైన మొక్కలు, మెడిసినల్‌ ప్లాంట్స్‌, వివిధ రకాల పూల మొక్కలతో సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేలా అద్భుతంగా వీటిని తీర్చిదిద్దారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేలా అందరికీ ఆహ్లాదాన్నిఅందించేలా ఈ పార్కులను అభివృద్ధి చేశారు. 

Updated Date - 2020-07-04T00:18:43+05:30 IST