రాజకీయాలకు అతీతంగా పట్టణ సమగ్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-07-01T06:33:18+05:30 IST

రాజకీయాలకు అతీతంగా పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు.

రాజకీయాలకు అతీతంగా పట్టణ సమగ్రాభివృద్ధి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

- ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు 

కోరుట్ల, జూన్‌ 30: రాజకీయాలకు అతీతంగా పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య అధ్యక్షతన మున్సిపల్‌ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు పాల్గొన్నారు. 27 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవ తీర్మాణంతో ఆమోదం తెలిపారు. రూ. 10 లక్షల నిధులతో మిషన్‌ భగీరథ ద్వార చెడిపోయిన రహదారుల మరమ్మతులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి రూ. 30 లక్షలు, ఫిల్టర్‌ బెడ్‌ వద్ద జంక్షన్‌ ఏర్పాటుకు రూ. 6లక్షలు పార్క్‌, క్రీడా స్థలం అభివృద్దికి రూ. 40 లక్షల  నిదులు మంజూరికి సభ్యులు అమోదం తెలిపారు. పట్టణంలో నెలకొన్న సమస్యలపై సభ్యులు సభా దృష్టికి తీసుకుపోగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు మాట్లాడారు. పట్టణంలోని వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ అయాజ్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ శ్రీనివాస్‌ రావు, టిపిఓ రమ్య, శానిటరీ ఇన్స్‌ప్పెక్టర్‌ గజానంద్‌లతో పాటు సమ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T06:33:18+05:30 IST