అర్బన్ హెల్త్ సెంటర్లను పరిశీలిస్తున్న కమిషనర్ కీర్తి చేకూరి
కమిషనర్ కీర్తి చేకూరి
గుంటూరు(కార్పొరేషన్), మే27: అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని కమిషనర్ కీర్తి చేకూరి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె బృందావన్ గార్డెన్స్, అమరావతి రోడ్డులోని ఆరోగ్యకేంద్రాలను జిల్లా వైద్య పారామెడికల్ అధికారి చుక్కా మన్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఇప్పటివరకు కేటాయించిన వైద్య పరికరాలు, కావలసిన వైద్యపరికరాల జాబితాను శనివారంలోపు తమకు అందించాలని డీసీఎంవోను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ దాసరి శ్రీనివాసరావు, చీఫ్ ఎంహెచ్‌వో విజయలక్ష్మి, డీఈ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ అజయ్‌కుమార్, వైద్య, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.