రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి

ABN , First Publish Date - 2020-10-31T07:08:34+05:30 IST

రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌


జగిత్యాల టౌన్‌, అక్టోబరు 30 : రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని 6, 7 వార్డుల్లో శుక్రవారం రూ. 10 లక్షల జడ్పీ సీనరేజ్‌ నిధుల ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్డు, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ .58 లక్షలతో నిర్మించనున్న మిషన్‌ భగీరథ పనులకు జిల్లా పరి షత్‌ అధ్యక్షురాలు దావ వసంత, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణిలతో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పనులను ప్రారంభిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ జగిత్యాలను మ రింత సుందరీకరణగా మార్చేందుకు చర్యలు చేబడుతున్నట్లు వివరించారు.


అనంతరం 47, 48 వార్డుల్లో రూ. 13 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రహదారి పనులకు భూమి పూజ నిర్వహించారు. పలువురు లభ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్‌ చెక్కులను అందజేశారు. నూతనంగా బల్దియాలో విలీనమైన గోవిందు పల్లె, తారకరామ నగర్‌లను మరింత అభిశృధ్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలగాని ప్రేమలత, వల్లెపు రేణుక, షేక్‌ చాంద్‌ పాష, దేవేందర్‌ నాయక్‌, రాజ్‌ కుమార్‌, బొడ్ల జగదీష్‌, నాయకులు మొగిలి, రాజేందర్‌, రాజమణి, పవన్‌, తిరుమలయ్య, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T07:08:34+05:30 IST