మహిళల భాగస్వామ్యంతోనే పట్టణ పరిశుభ్రత

ABN , First Publish Date - 2022-09-26T05:43:24+05:30 IST

మహిళల భాగస్వామ్యంతోనే పట్టణ పరిశుభ్రత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

మహిళల భాగస్వామ్యంతోనే పట్టణ పరిశుభ్రత
చైర్‌ పర్సన్‌తో కలిసి బతుకమ్మ చీర అందజేస్తున్న ఎమ్మెల్యే

 ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 25 : మహిళల భాగస్వామ్యంతోనే పట్టణ పరిశుభ్రత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. బతు కమ్మ పండుగను పురస్కరించుకని తెలంగాగాణ ప్రభుత్వ కానుకగా మహి ళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని 13, 31, 26, 27 వార్డుల ఆడబిడ్డలకు బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణితో కలి సి ఎమ్మెల్యే చీరలను అందించి మాట్లాడారు. అన్ని కులాల, మతాల సంక్షే మమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి న అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక శ్రధ్య వహించామని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో గతంలోకంటే అభి వృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుల్తా నా, రజియుధ్దీన్‌, డీఈ రాజేశ్వర్‌, నాయకులు సమిండ్ల శ్రీనివాస్‌, రియాజ్‌, జిలానీ, అక్మల్‌ ఉన్నారు.

Updated Date - 2022-09-26T05:43:24+05:30 IST