అభివృద్ధే ధ్యేయంగా ‘పట్టణ, పల్లె ప్రగతి’

ABN , First Publish Date - 2022-05-19T05:49:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు, పట్టణాలు అభివృద్ధే ధ్యేయంగా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.

అభివృద్ధే ధ్యేయంగా ‘పట్టణ, పల్లె ప్రగతి’
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి సమావేశానికి హాజరైన మేయర్‌ యాదగిరి సునీల్‌రావు

- సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో కార్యాచరణ 

- మేయర్‌ యాదగిరి సునీల్‌రావు 

కరీంనగర్‌ టౌన్‌, మే 18: రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు, పట్టణాలు అభివృద్ధే ధ్యేయంగా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన పల్లె, పట్టణ ప్రగతి సమీక్షా సమావేంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ సునీల్‌రావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ జూన్‌ 3వ తేదీ నుంచి 15 రోజులపాటు నగరంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం మేరకు ప్రణాళికను రూపొందించుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు పట్టణ ప్రగతి నిధులను రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కోసం కాకుండా పార్కులు, ఓపెన్‌ జిమ్స్‌, వాకింగ్‌ ట్రాక్స్‌, మోడ్రన్‌ టాయిలెట్లు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణం వంటి వాటికి వెచ్చించామని చెప్పారు. ఈసారి కూడా 15 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అభివృద్ధి కార్యాచరణ రూపొందించుకొని నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని చెప్పారు. 

Updated Date - 2022-05-19T05:49:31+05:30 IST