ముంపు టేరు

ABN , First Publish Date - 2020-10-18T17:03:42+05:30 IST

ముంపు టేరు

ముంపు టేరు

ఉప్పొంగిన ఉప్పుటేరు 

14 గ్రామాల్లో భయం భయం

10 గ్రామాలకు సంబంధాలు కట్‌

భీమవరానికి యనమదుర్రు పోటు

ప్రయాణానికి ట్రాక్టర్లే శరణ్యం 


భీమవరం: వాన వీడి.. వరద తగ్గిం దనుకుంటే.. ఎగువ నుంచి వచ్చి పడుతున్న వరద నీరు కారణంగా శనివారం ఉప్పుటేరు ఉగ్రరూపం దాల్చింది.. పరీవాహక గ్రామాలన్నీ వరద నీటి ముంపునకు గురయ్యాయి. ఉప్పుటేరుకు ఎగువన కొల్లేరు నుంచి, పలు డ్రెయిన్ల నుంచి మరింత వరద నీరు వచ్చి చేరింది. ఏజన్సీ, మెట్ట ప్రాం తం నుంచి ప్రధాన మురుగు కాలువల నుంచి ప్రవాహం పెరగడంతో ఉప్పుటేరుకు వరద పోటు పెరిగింది. ఉప్పుటేరులో 30 వేల క్యూసెక్కుల పైగా నీరు ప్రవహిస్తుండగా..యనమదుర్రులో 24 క్యూసెక్కులకు పెరిగిం ది. మొగల్తూరు మండలంలో మేజర్‌, మీడియం డ్రెయి న్లు ఎగదన్నడంతో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఉప్పుటేరులో కలిసే రుద్రాయికోడు, బొండాడ డ్రెయిన్‌, గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌, గొంతేరులు వరుసగా మూడో రోజు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఆకివీడు, కాళ్ల మండలాలు ఉప్పుటేరు ముంపులో చిక్కు కున్నాయి. రెండు మం డలాల్లో సుమారు 14 గ్రామాల ప్రజలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు .


కోళ్ళపర్రు వంతెన పైనుంచి చినకాపవరం డ్రెయిన్‌ ఉధృ తంగా ప్రవహిస్తున్నది. దీంతో కోళ్ళపర్రు గ్రామ ప్రజలు పురాతన వంతెన గురించి ఆందోళన చెందుతున్నారు. యనమదుర్రు ఉధృతి కారణంగా భీమవరం పట్టణంలో కొన్ని కాలనీ లు, ప్రభుత్వా సుపత్రి రోడ్డు నీట మునిగాయి. పట్టణం లో దుర్గాపురం, లంకపేట గత మూడు రోజులుగా ముంపులోనే ఉన్నాయి. ఉప్పుటేరు ఉధృతి కారణంగా ఇప్పటికే  ఆకివీడు మండలంలో 10 గ్రామాలతో సం బంధాలు కట్‌ అయ్యాయి. ఉప్పుటేరు, చినకాపవరం డ్రెయిన్ల ఉధృతికి సిద్ధాపురం, కళింగపాలెం, చినమిల్లిపా డు, రాజులపేట గ్రామాలు, చినకాపవరం డ్రెయిన్‌ ఉధృతికి గుమ్ములూరు, తరటావ, కోళ్ళపర్రు,అప్పారావు పేట, చినకాపవరం, పెదకా పవరం గ్రామాలతో సంబం ధాలు కట్‌ అయ్యాయి. కాళ్ల మండలంలో ఏలూరుపాడు, ప్రాతాళ్ళమెరక, పల్లిపాలెం, మోడి తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. శనివారం తెల్లవారుజామున ప్రాతాళ్ళమెరక పంచాయితీ పరిధిలోని పల్లిపాలెం ప్రాంతంలో ఉప్పుటేరు గట్లను దాటి గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తింది. పల్లిపాలెం ప్రాంతమంతా జలాశయంగా మారింది.


రహదారు లపై సుమారు 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నది. ఏటిగట్టుకు ఎక్కడ గండి పడుతుందో న న్న భయంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు. ఆకివీడు మండలం లో ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 280 మందిని తరలించా మని తహసీల్దార్‌ కుమార్‌ తెలిపారు. ముంపునకు గురైన తొండకోడు ప్రాంతం లోని సుమారు 50 కుటుం బాలకు రూరల్‌ బ్యాంకు బ్రాంచిలో పునరావాసం కల్పించారు. సిద్ధాపురంలోని దామో దరం సంజీవయ్య జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని శనివారం వరద నీరు చుట్టుముట్టింది. దీంతో వరద బాఽధితులను పై అంతస్తులో ఉంచారు.మండల కేంద్రంతో సంబంధాలు కోల్పోయిన గ్రామాలు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్టర్లు, రేకు పడవలను ప్రయాణానికి ఉపయోగిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విధులకు వెళ్లాలంటే పడవలను లేదా ట్రాక్టర్లను ఆశ్రయి స్తున్నారు. ప్రమాదంలో ప్రయాణం చేసి విధులు నిర్వహిస్తున్నారు. యర్రకాలువకు వరద తగ్గుముఖం పట్టడంతో యనమదుర్రుకు శనివారం రాత్రికి వరద నీరు తగ్గే అవకాశం ఉంది. 


వదలని..అల్పపీడనం : రైతుల ఆందోళన 

ఏలూరుసిటీ: బంగాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా  జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శనివారం కూడా భారీగానే వర్షాలు కురిశాయి.  ఉదయం ఎండ వాతావరణం కనిపించినా ఆ వెనువెంటనే దట్టమైన కారు మబ్బులు వచ్చి భారీగా చినుకులు పడ్డాయి. నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతులను వరద కష్టాలు వీడకుండానే మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో గడచిన 24 గంటల్లో అత్యధికంగా పెదపాడు మండలంలో 70.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.జిల్లాలో మొత్తం వర్షపాతం 552.6 మిల్లీమీటర్లు కాగా  సరాసరి వర్షపాతం 11.5  మిల్లీమీటర్లుగా ఉంది. కుక్కునూరులో 59.8, పాలకోడేరు 46.8, పోలవరం 44, జంగారెడ్డిగూడెం 43.8, ఉండ్రాజవరం 42.6, యలమంచిలి 33 మిగిలిన మండలాల్లో కూడా వర్షపాతం నమోదైంది. 


70,510 ఎకరాల్లో పంటలు మునక

ఏలూరు: వ్యవసాయ శాఖ అందించిన ప్రాథమిక అంచనాల నివేదికల ప్రకా రం శనివారం నాటికి జిల్లాలో 70,510 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. జిల్లాలోని 437 గ్రామా ల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి పంట 63,521 ఎకరాల్లో నీట మునిగింది. 3342.50 ఎక రాల్లో వరి చేలు నేలకొరిగాయి. వేరుశనగ 242.725 ఎకరాల్లో, ప్రత్తి  931.075 ఎకరాల్లోను, మినుము 2460.05  ఎకరాల్లోను, పెసలు 3 ఎకరాలు, మొక్క జొన్న 10.50 ఎకరాలు నీటమునిగాయని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగం తెలిపారు. 


ఉద్యాన పంటల నష్టం రూ.10.85 కోట్లు

భారీ వర్షాలకు ఉద్యాన పంటలు 1842.50 ఎకరాల్లో నీట మునిగాయి. శనివారం ఉద్యానశాఖ ఉన్నతాధికారులు జిల్లా లోని పలు గ్రామాల్లో పర్యటించారు. జిల్లా ఉద్యానశాఖ డీడీ సుబ్బారావు, ఏడీ బాలాజీకుమార్‌లు దెబ్బతిన్న ఉద్యాన పం ట పొలాలను పరిశీలిచారు. ద్వారకాతిరుమల మండలం తి మ్మాపురం, పావులూరివారి గూడెం, తిరుమలంపాలెం, నల్ల జర్ల మండలంలోని తెలికిచర్ల, చోడవరం, తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలోని పల్టెన్నపాలెం, వీరంపాలెం, కూనవ రం, కొమ్ముగూడెం గ్రామాల్లో తోటలు పరిశీలించారు. ఇప్పటి వరకు   ఉద్యాన శాఖ ప్రాఽథమిక అంచనాల ప్రకారం పంట ల నష్టం రూ.10.85 కోట్లు వరకు ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2020-10-18T17:03:42+05:30 IST