Abn logo
Sep 24 2021 @ 19:28PM

యూపీఎస్సీ ఫలితాలు విడుదల.. శుభం కుమార్ టాప్

న్యూఢిల్లీ: యూపీఎస్సీ 2020 ఫలితాలు విడుదల అయ్యాయి. కేంద్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ శుక్రవారం సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేసింది. కాగా, 2020 సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో శుభం కుమార్ మొదటి ర్యాంక్ సాధించారు. జాగ్రతి అవస్తి, అంకిత జైన్ రెండు, మూడు ర్యాంకులు సాధించారు. 2020లో నిర్వహించిన ఈ పరీక్షలో మొతంతం 761 మంది మెయిన్స్‌లో అర్హత సాధించి అపాయింట్‌మెంట్‌కు ఎంపికైనట్లు శుక్రవారం యూపీఎస్సీ విడుదల చేసిన వివరాల్లో పేర్కొన్నారు. కాగా, తెలుగు అమ్మాయి పి.శ్రీజ 20వ ర్యాంక్ సాధించడం విశేషం.


ఇక మొత్తం అభ్యర్థుల్లో కేటగిరీల వారీగా జనరల్ 263, ఈడబ్య్లూఎస్ 86, ఓబీసీ 229, ఎస్సీ 122, ఎస్టీ 61 అభ్యర్థులు ఎంపికయ్యారు. కాగా ఇందులో 180 మంది ఐఏఎస్, 36 మంది ఐఎఫ్ఎస్, 200 మంది ఏపీఎస్‌, మిగిలిన వారు సెంట్రల్ సర్వీసుల్లోని గ్రూప్ ఏ, గ్రూప్ సర్వీసులకు ఎంపికయ్యారు.