Upsc ఫలితాల్లో 25 మంది కన్నడిగులకు ఉత్తమ ర్యాంకులు

ABN , First Publish Date - 2022-05-31T17:15:04+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షలలో కర్ణాటకకు చెందిన 25 మంది ఉత్తమ ప్రతిభ చాటారు. 30లోపు ర్యాంకులు ఎవరికీ

Upsc ఫలితాల్లో 25 మంది కన్నడిగులకు ఉత్తమ ర్యాంకులు

                       - 31వ ర్యాంకు సాధించిన దావణగెరె వాసి


బెంగళూరు: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షలలో కర్ణాటకకు చెందిన 25 మంది ఉత్తమ ప్రతిభ చాటారు. 30లోపు ర్యాంకులు ఎవరికీ దక్కలేదు. యూపీఎస్సీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దావణగెరెకు చెందిన అవినాష్‌ 31వ ర్యాంకు సాధించగా బెనక ప్రసాద్‌-92 నిఖిల్‌ బి. పాటిల్‌-139, వినయ్‌కుమార్‌ గాడిగ-151, చిత్తరంజన్‌-155, కె. మనోజ్‌కుమార్‌- 157, అపూర్వబసూర్‌-191, నిత్యా- 207, మంజునాథ్‌-219, రాజేష్‌ పొన్నప్ప-222, సాహిత్య ఆలదకట్టి-250, కల్పశ్రీ- 291, అరుణా- 308, దీపక్‌ రామచంద్ర సేఠ్‌- 311, హర్షవర్ధన్‌ - 318, వినయ్‌కుమార్‌ - 352, మేఘన- 425, సవితా గూట్యాల్‌- 479, మహమ్మద్‌ సిద్దికి షరీఫ్‌- 516, చేతన్‌. కే- 532, ఎన్‌ఎస్ ప్రకాష్‌- 568, ప్రశాంత్‌కుమార్‌ - 641, సుచిన్‌ కేవీ- 682 ర్యాంకులు సాధించారు.


కవలల్లో అవినాష్‌ ర్యాంకర్‌.. అర్పిత ఎంబీబీఎస్‌ 

దావణగెరెకు చెందిన విఠల్‌రావుకు కవలలు కాగా వీరిలో అవినాష్‌ ప్రస్తుతం యూపీఎస్సీ ర్యాంకు సాధించగా అర్పిత ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తీ చేసి ఎండీ కోర్సుకు సిద్ధమవుతున్నారు. అవినాష్‌ తాత ఆనందరావు ఉడుపి జిల్లాకు చెందినవారు. దావణగెరెలోనే పీయూ దాకా చదివిన అవినాష్‌ తర్వాత బెంగళూరులోని నేషనల్‌ లా యూనివర్సిటీలో ఐదేళ్ల కోర్సు చేశారు. లా కోర్సులో బంగారు బహుమతి సాధించిన అవినాష్‌ తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 31వ ర్యాంకు సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసును ఎంపిక చేసుకున్నారు. కుమారుడి సాధనపై విఠల్‌రావు మాట్లాడుతూ ఫారిన్‌ సర్వీసును ఎంపిక చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పనిచేయాలని కలలు కన్నారన్నారు. కుమారుడు యూపీఎస్సీలో ర్యాంకు రావడం, కుమార్తె డాక్టర్‌ కోర్సు పూర్తీ చేసి ఎండీకు సిద్ధం కావడం సంతోషంగా ఉందని తండ్రి విఠల్‌రావు, తల్లి స్మితారావు మీడియాకు తెలిపారు.

Updated Date - 2022-05-31T17:15:04+05:30 IST