స్వీపర్ తనయుడు సివిల్స్‌లో సూపర్

ABN , First Publish Date - 2022-05-31T00:57:56+05:30 IST

కాశింపల్లి: స్వీపర్ కుమారుడు సివిల్స్ టాపర్‌గా నిలిచాడు. భూపాలపల్లి జిల్లా కాశింపల్లి గ్రామానికి ఆకునూరి నరేశ్(29) సివిల్స్‌లో 117వ ర్యాంక్ సాధించాడు.

స్వీపర్ తనయుడు సివిల్స్‌లో సూపర్

కాశింపల్లి: స్వీపర్ కుమారుడు సివిల్స్ టాపర్‌గా నిలిచాడు. భూపాలపల్లి జిల్లా కాశింపల్లి గ్రామానికి ఆకునూరి నరేశ్(29) సివిల్స్‌లో 117వ ర్యాంక్ సాధించాడు. నరేశ్ తండ్రి ఐలయ్య కూలీ పని చేస్తారు. అమ్మ సులోచన సింగరేణిలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. నరేశ్‌కు 117వ ర్యాంక్ రావడంతో కాశింపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని వారంతా నరేశ్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. తమ గ్రామ యువకుడికి మంచి ర్యాంక్ రావడంపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 





Updated Date - 2022-05-31T00:57:56+05:30 IST