Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు

మాజీ మంత్రి కోండ్రు మురళి

 సర్పంచ్‌తో పాటు వందలాది మంది టీడీపీలో చేరిక 

రేగిడి, నవంబరు 24: వైసీపీ ప్రభుత్వ ఆరాచకాలు, సీఎం జగన్‌ పాలనపై విసుగు చెందిన ప్రజల్లో తిరుగుబాటు ప్రాంభమైందని, దీనికి ఉంగరాడ పంచాయతీ ప్రజలే ఉదాహరణ అని మాజీ మంత్రి, టీడీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. ఉంగరాడ సర్పంచ్‌ చల్ల శోభారాణి, ఆమె భర్త భుజంగరావు, గుళ్లపాడు, వండానిపేట గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లతో పాటు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు బుధవారం టీడీపీలో చేరారు. వీరికి కోండ్రు  కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించడం చూస్తుంటే మహిళలపై వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపితమైందన్నారు. ఉంగరాడ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా  చల్ల భుజంగరావు  గ్రామ సమస్యలను ప్రస్తావించగా వా టి పరిష్కారానికి కృషి చేస్తానని కోండ్రు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కిమిడి అశోక్‌బాబు,  నాయకు లు గురవాన నారాయణరావు, కర్ణేణ మహేశ్వరరావు, కోడిశ, తుని వాడ, అంబఖండి సర్పంచ్‌లు జి.రమేష్‌, కె.ధనంజయ్‌నాయుడు, శాసపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement