ఉప్పర్లను అన్ని విధాలా ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-10-25T06:29:33+05:30 IST

ఉప్పర కులస్థులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆ సంఘం నాయకులు మహారాష్ట్ర పార్సీ డిస్టిక్‌ షోలాపూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ హిప్పర్కర్‌ పే ర్కొన్నారు.

ఉప్పర్లను అన్ని విధాలా ఆదుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఉప్పర సంఘం నాయకులు

అనంతపురంరూరల్‌, అక్టోబరు24: ఉప్పర కులస్థులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆ సంఘం నాయకులు మహారాష్ట్ర పార్సీ డిస్టిక్‌ షోలాపూర్‌కు చెందిన  ప్రొఫెసర్‌ హిప్పర్కర్‌ పే ర్కొన్నారు. ఆదివారం అఖిల భారత ప్రాచీన ఉప్పు తయారు దారు ల సమాఖ్య (ఢిల్లీ), జిల్లా ఉప్పర(సగర)సంఘం ఆధ్వర్యంలో మం డలంలోని సోములదొడ్డి సమీపంలోని ఆసంఘం కళ్యాణ మండపంలో ఉప్పర ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. రాయలసీమ జిల్లాల ఉప్పర సం ఘాల అధ్యక్షు రాలు నాగమణి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమానికి మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్‌ హిప్పర్కర్‌, స్టాల్‌ మేకర్‌ ఫెడరేషన బీహర్‌ జనరల్‌ సెక్రటరీ ప్రమోద్‌కుమార్‌ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. వారు మా ట్లాడుతూ...  దేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో ఉప్పరులు విస్తరించ ఉన్నారన్నారు. వారికి పక్కా ఇళ్లు నిర్మించాలని, సహకార సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పనులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామలింగయ్య, కర్నూలు, కడప అధ్యక్షులు రాముడు మా దాసు మురళి, విశ్రాంత డీఎఫ్‌ఓ శ్రీనివాసులు, గుంతకల్లు మార్కెట్‌ యార్డు చైర్మన భీమలింగ, కణేకల్‌ జడ్పీటీసీ పద్మావతి, సోమందేపల్లి మాజీ జడ్పీటీసీ వెంకటరమణ, రొద్దం మాజీ ఎంపీపీ నరసింహులు, ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, న్యాయవాది శశికళ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T06:29:33+05:30 IST