సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' టీజర్ బుధవారం విడుదలైంది. వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. చేపలు పట్టే ఓ అబ్బాయి, శ్రీమంతుల అమ్మాయి మధ్య ప్రేమకథగా ఈ సినిమా రూపొందింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా నటించాడు. డిఫరెంట్ లవ్‌స్టోరిగా సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే 'ఉప్పెన' సినిమా విడుదలపై నిర్మాతలు నిర్ణయం తీసుకోనున్నారు.