Abn logo
Sep 17 2020 @ 07:37AM

ఉప్పల్‌లో రోడ్డు విస్తరణకు అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్/ఉప్పల్‌ : ఉప్పల్‌లో జాతీయ రహదారిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను, బహుల అంతస్తు భవనాలను జీహెచ్‌ఎంసీ ఉప్పల్‌ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య భారీగా కట్టడాలను కూల్చివేశారు. అంతకు ముందురోజు ఉప్పల్‌ - వరంగల్‌ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. ప్రధాన దహదారి విస్తరణలో భాగంగా రోడ్డును ఇరువైపుల 75 అడుగుల చొప్పున మొత్తం 150 అడుగులకు విస్తరిస్తూ ఆమేరకు భవన యజమానులకు  నష్టపరిహారం చెల్లించారు. 

నష్టపరిహారం తీసుకున్న యజమానులు మళ్ళీ 75 అడుగులు దాటి రోడ్డుపైకి రెయిలింగ్‌లను నిర్మించడంతో మంగళవారం జాతీయ రహదారుల విభాగం, రోడ్లు భవనాల శాఖ, ఉప్పల్‌టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కలిసి రోడ్డును సర్వే చేసి రోడ్డు విస్తరణకు విఘాతం కలిగిస్తున్న కొన్ని నిర్మాణాలను గుర్తించారు. బుధవా రం ఉదయం పోలీసులు బందోబస్తు మధ్య ఆయా నిర్మాణాలను కూల్చివేశారు. ఉప్పల్‌ మెయిన్‌రోడ్డులో 75 అడుగుల వరకు మాత్ర మే నిర్మాణాలు చేపట్టాలని, లేదంటే కూల్చివేస్తామని టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ శ్రావణి, టీపీఎస్‌ సురేందర్‌రెడ్డి, మౌనిక హెచ్చరించారు. 

Advertisement
Advertisement
Advertisement